గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : అమెరికాలో ట్రీట్‌మెంట్ నిజ‌మేనా..? స‌మంత అనారోగ్య స‌మ‌స్య‌ల‌పై క్లారిటీ ఇచ్చేసిన మేనేజ‌ర్‌..

Samantha : గతకొంత కాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అయితే సామ్‌ మాత్రం ఇవన్ని లైట్‌…

Samantha : అమెరికాలో ట్రీట్‌మెంట్ నిజ‌మేనా..? స‌మంత అనారోగ్య స‌మ‌స్య‌ల‌పై క్లారిటీ ఇచ్చేసిన మేనేజ‌ర్‌..

Samantha : గతకొంత కాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అయితే సామ్‌ మాత్రం ఇవన్ని లైట్‌ తీసుకుంది. అంతేకాదు సోషల్‌ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్‌ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, మరికొందరు ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించింది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. మొఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్‌లా తయారైంది అంటున్నారు జనాలు. ఆమె చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని, దానికి అమెరికాలో చికిత్స తీసుకుంటుందని పుకార్లు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్‌ స్పందించాడు.

is it true that Samantha health is not ok what her manager said
Samantha

సమంత అనారోగ్యంపై వస్తోన్న వార్తలను మేనేజర్‌ ఖండించాడు. సమంతకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రూమర్స్ ని నమ్మవద్దని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉండటానికి కారణమేంటనే దానిపై మాత్రం మేనేజర్‌ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో శాకుంతలం, యశోద, అలాగే విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు బాలీవుడ్ లో ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది. అలాగే హాలీవుడ్ లో ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ లో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి