గురువారం, జూన్ 11, 2026
స‌మాచారం

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న బంప‌ర్ ఆఫ‌ర్.. ఇలా చేస్తే రూ.1 ల‌క్ష మీవే..!

ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ, కోరోవ‌ర్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఓ కాంపిటీష‌న్‌లో పాల్గొంటే రూ.1 ల‌క్ష గెలుచుకోవ‌చ్చు. అందుకు చేయాల్సిందల్లా వీడియోల‌ను తీసి అప్‌లోడ్ చేయ‌డ‌మే.…

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న బంప‌ర్ ఆఫ‌ర్.. ఇలా చేస్తే రూ.1 ల‌క్ష మీవే..!

ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ, కోరోవ‌ర్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఓ కాంపిటీష‌న్‌లో పాల్గొంటే రూ.1 ల‌క్ష గెలుచుకోవ‌చ్చు. అందుకు చేయాల్సిందల్లా వీడియోల‌ను తీసి అప్‌లోడ్ చేయ‌డ‌మే.

irctc bumper offer you can win rs 1 lakh by doing this

ప్ర‌యాణాలు అంటే బాగా ఇష్టం ఉన్న‌వారు భార‌తీయ రైల్వేతోపాటు ఐఆర్‌సీటీసీకి చెందిన టిక్కెటింగ్‌, కాట‌రింగ్‌, టూరిజం వంటి పలు ర‌కాల అంశాల‌పై వీడియోల‌ను తీయాలి. వాటిని https://corover.ai/vlog/ అనే సైట్‌లో అప్‌లోడ్ చేసి వివ‌రాల‌ను న‌మోదు చేసి కాంపిటీష‌న్ లో పాల్గొనాలి. దీంతో ఈ పోటీలో మొద‌టి స్థానంలో నిలిచిన వారికి రూ.1 ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేస్తారు.

రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25వేల బ‌హుమ‌తిని అంద‌జేస్తారు. అలాగే ట్రోఫీ, సర్టిఫికెట్‌ను కూడా ప్ర‌దానం చేస్తారు. ఇక మ‌రో 297 మందికి రూ.500 న‌గ‌దు బ‌హుమ‌తి, స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేస్తారు. ఈ పోటీలో పాల్గొనాల‌నుకునే వారు ఆగ‌స్టు 31లోగా త‌మ వీడియోల‌ను ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అందులో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా స‌రే ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చు.

ఈ పోటీలో మొత్తం 300 విన్న‌ర్ల‌కు న‌గదు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. వీడియోల క్వాలిటీని బ‌ట్టి విన్న‌ర్ల‌ను ఎంపిక చేస్తారు. యూజ‌ర్లు పంపిన అన్ని వీడియోలు ఐఆర్‌సీటీసీకి చెందుతాయి. కాపీరైట్ వారికే ఉంటుంది. కానీ వీడియో తీసిన వారి పేరును దానిపై వేస్తారు. యూజ‌ర్లు ఐఆర్‌సీటీసీకి చెందిన IRCTC Tourism, IRCTC Air, IRCTC iMudra App, Website, IRCTC E-Catering, IRCTC SBI Card, IRCTC New E-Ticketing Website, IRCTC Bus Booking, IRCTC Tejas Train, IRCTC Retiring Room Booking వంటి అంశాల‌పై వీడియోల‌ను తీయ‌వ‌చ్చు. ఈ వివ‌రాల‌ను ఐఆర్‌సీటీసీ తాజాగా ఓ ట్వీట్‌లో తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి