గురువారం, జూన్ 11, 2026
విద్య & ఉద్యోగం

పోస్టల్ శాఖలో 2357 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

పదో తరగతి ఉత్తీర్ణత సాధించారా.. సొంత ఊరిలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం…

పోస్టల్ శాఖలో 2357 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

పదో తరగతి ఉత్తీర్ణత సాధించారా.. సొంత ఊరిలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలు పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్టుమాస్టర్, డాక్ సేవక్ వంటి విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 2357 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఇంగ్లీషులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ 60 రోజుల కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్స్ పొంది ఉండాలి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య ఉండాలి. ₹100 పరీక్ష రుసుము చెల్లించాలి. మహిళలు ఎస్సీ ఎస్టీ ఇతరులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 12000, ఇతర ఉద్యోగులకు పది వేలు జీతం చెల్లిస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 19, 2021 ఆఖరి తేదీ.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు.

https://appost.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి