గురువారం, జూన్ 11, 2026
అంత‌ర్జాతీయం

ఒక వాటర్ బాటిల్ ఖరీదు రూ.3 వేలు.. బిక్కు బిక్కుమంటూ జీవితం..

ప్రస్తుతం కాబుల్ రాజధాని అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తాలిబన్లు ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి దేశ అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడి అక్కడి నుంచి…

ఒక వాటర్ బాటిల్ ఖరీదు రూ.3 వేలు..  బిక్కు బిక్కుమంటూ జీవితం..

ప్రస్తుతం కాబుల్ రాజధాని అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తాలిబన్లు ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి దేశ అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడి అక్కడి నుంచి బయటకు వలసలకు వెళ్లిపోతున్నారు. ఏదో ఒక చిన్న ఆశతో తమ ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోతున్నారు. దీంతో ఎయిర్ పోర్టు చుట్టూ ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు.

ఇక అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఒక వాటర్ బాటిల్ ధర $40. అంటే మన దేశీ కరెన్సీ ప్రకారం రూ.3 వేలు అన్నమాట. దాంతో దాహం తీర్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక ప్లేట్ మీల్స్ ను 100 డాలర్లకు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలందరూ తమ కడుపు నింపుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.

అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి ఓ వార్తా సంస్థకు తమ పరిస్థితి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాబుల్ ఎయిర్ పోర్ట్ బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ.. కాంపౌండ్ వాల్ బయట ఉన్న వాళ్ళు లోపలికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. ఇక కొందరు మురికి కాలువలో కూడా వేచి ఉన్నారని.. ఎలాగైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి