గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Honey For Face : తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తేనెతో చాలా సమస్యలు తొలగిపోతాయి. తేనెతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చర్మాన్ని తేమగా…

Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Honey For Face : తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తేనెతో చాలా సమస్యలు తొలగిపోతాయి. తేనెతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చర్మాన్ని తేమగా మారుస్తుంది తేనె. తేనెని ముఖానికి పట్టిస్తే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని తేనెని ముఖానికి పట్టించి పూర్తిగా అది పీల్చుకున్నాక చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. సుమారు అరగంట పాటు ఉంచుకుంటే చాలు.

చర్మం బాగుండాలంటే ముఖానికి తేనె రాసుకొని ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసుకోండి. చర్మంపై గాయాలు తగ్గిపోతాయి. మృత కణాలు కూడా తొలగిపోతాయి. కొత్త చర్మ కణాల‌ ఉత్పత్తికి తేనె సహాయం చేస్తుంది. తేనెతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవాలంటే తేనెని రాసుకుంటూ ఉండండి. తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కిన్ ఇరిటేషన్ ని బాగా తగ్గిస్తాయి.

Honey For Face how to use this for facial glow
Honey For Face

మొటిమల కారణంగా వచ్చిన మచ్చల్ని కూడా తేనె పోగోడుతుంది. తేనెలో ఎమోలియంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే జుట్టుని ఆరోగ్యంగా ఉంచగలవు. జుట్టు కుదుళ్ళకి తేమని అందిస్తాయి. చిట్లిన జుట్టుని మృదువుగా మార్చేస్తుంది తేనె. అలాగే జుట్టు ఎదుగుదలకి సహాయం చేస్తుంది. వారానికి ఒకసారి అరకప్పు బియ్యంలో ఒక కప్పు నీళ్లు పోసుకు, రెండు గంటల పాటు నానబెట్టి ఆ నీళ్ళని వడకట్టేసి అందులో వేడి చేసిన తేనెను మిక్స్ చేయండి.

దీన్ని పట్టించేసి ఆ తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం వంటి బాధలు ఉండవు. కుదుళ్ళు గట్టిపడతాయి. ఇలా ఈ విధంగా మీరు ఉపయోగించినట్లయితే చక్కటి లాభాలని పొందొచ్చు. ముఖ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి ఇలా తేనె ఎంతగానో సహాయం చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి