YS Sharmila : వైఎస్ ష‌ర్మిల కుమారుడు, కుమార్తెల‌ను చూశారా..?

May 20, 2022 8:06 PM

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఈ మ‌ధ్య కాలంలో పాద‌యాత్ర‌లు చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. తెలంగాణ‌లో ఆమె ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. ప్ర‌భుత్వాన్ని నిల‌దిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ అని చాలా మందికి తెలుసు. కానీ వారి పిల్ల‌లు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌నే చెప్పాలి. కానీ లేటెస్ట్‌గా వారు బ‌య‌ట క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే వారి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ష‌ర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేష‌న్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రాడ్యుయేష‌న్ సెర‌మ‌నీకి ష‌ర్మిల‌, ఆమె భ‌ర్త అనిల్ కుమార్‌, త‌ల్లి విజ‌య‌మ్మ‌లు కూడా వెళ్లారు. అక్క‌డ వైఎస్ రాజారెడ్డి గ్రాడ్యుయేష‌న్ వేడుక‌ల్లో వారంద‌రూ సంద‌డి చేశారు. చిత్రంలో ష‌ర్మిల కుమార్తెను కూడా చూడ‌వ‌చ్చు.

have you ever seen YS Sharmila son and daughter
YS Sharmila

ఇక డ‌ల్లాస్‌లోని స‌ద‌ర‌న్ మెథ‌డిస్ట్ యూనివ‌ర్సిటీలో రాజారెడ్డి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ట్వీట్ చేశారు. రాజా.. నీకు కంగ్రాట్స్‌.. నా చేతుల్లో పెరిగిన నువ్వు ఈ రోజు ఇలా ఒక అద్భుతం పూర్తి చేయ‌డం నిజంగా సంతోషంగా ఉంది, నిజాయితీగా, ద‌య‌తో ఉండు, నీ చుట్టూ ఉన్న ప్ర‌జ‌ల‌కు విలువ‌నివ్వు, దేవుడు నిన్ను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నా.. అంటూ ష‌ర్మిల ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె ట్వీట్‌తోపాటు వారి ఫ్యామిలీ ఫొటో కూడా వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now