Hansika : హ‌న్సిక సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌కు గుడ్‌బై..? త్వ‌ర‌లోనే పెళ్లి..?

August 4, 2022 8:44 PM

Hansika : టాలీవుడ్‌ను ఒక‌ప్పుడు ఏలిన హీరోయిన్ల‌లో హ‌న్సిక ఒక‌రు. ఈమె పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన దేశ ముదురు చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. బాల‌న‌టిగా ప‌లు హిందీ మూవీల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. అయితే దేశ‌ముదురు స‌క్సెస్ కావ‌డంతో ఈమె ద‌శ ఒక్క‌సారిగా తిరిగిపోయింది. ఈమెకు వ‌రుస చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌ట్లో యంగ్ హీరోలు అంద‌రితోనూ ఈ బ్యూటీ న‌టించింది.

టాలీవుడ్‌ను హ‌న్సిక ఒక‌ప్పుడు ఏలింది. కానీ ఇప్పుడు ఈమెకు ఆఫ‌ర్లు అంత‌గా లేవు. ఒక‌టి రెండు చిత్రాలు త‌ప్పితే ఈమె పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో చేసిన హ‌న్సిక ఇక‌పై వాటికి గుడ్ బై చెప్పి లైఫ్‌లో సెటిల్ అవ్వాల‌ని చూస్తోంద‌ట‌. ఈమెకు 32 ఏళ్లు. దీంతో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటోంద‌ట‌. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని స‌మాచారం. హ‌న్సిక ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడితో ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Hansika sensational decision will marry soon
Hansika

ఇక ఆ రాజ‌కీయ నాయ‌కుడి త‌న‌యుడు ప‌లు వ్యాపారాలు చేస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే హ‌న్సిక‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని అత‌ను త‌న ఇంట్లోనూ చెప్పాడ‌ట‌. అక్క‌డ చ‌ర్చ‌లు కూడా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇరు వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాలు కూడా ఓరే అన్నార‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే వీరిద్ద‌రికీ నిశ్చితార్థం చేయ‌నున్నార‌ని స‌మాచారం. త‌రువాత పెళ్లి చేయ‌బోతున్నార‌ని తెలిసింది. అయితే ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లే. వీటిలో నిజం ఎంత ఉంది.. అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా హ‌న్సిక బాల‌న‌టిగా హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. వెండితెర‌కు దేశ‌ముదురు ద్వారా ప‌రిచ‌యం అయింది. త‌రువాత కంత్రీ, మ‌స్కా, బిల్లా, జ‌యీభ‌వ‌, సీతారాముల క‌ల్యాణం, కందిరీగ‌.. వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక త‌మిళంలోనూ ప‌లు మూవీల్లో న‌టిస్తోంది. అయితే హ‌న్సిక పెళ్లి వార్త‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment