Samantha : సమంత అభిమానులకు గుడ్‌ న్యూస్‌..! కొత్త మూవీతో పలకరింపు..!

November 16, 2021 9:19 PM

Samantha : గత కొన్ని రోజుల నుంచి సమంత వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలను తెరపైకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా సమంత విడాకుల ప్రకటన అనంతరం పూర్తిగా ఆ బాధ నుంచి బయటపడి సినిమాలపై దృష్టి పెట్టింది.

good news to Samantha fans new movie releasing soon

ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత ఒక సినిమాని పూర్తి చేసుకోగా.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతోంది. తమిళంలో సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో విఘ్నేశ్వర శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాతువాకుల రెండు కాదల్. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిలో.. బస్సులో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న సన్నివేశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ మూవీలో సమంత ఖతీజా అనే పాత్రలో నటిస్తోంది. ఏది ఏమైనా సమంత విడాకుల తర్వాత ఈ సినిమా రాబోతుండడంతో సమంత వ్యక్తిగత విషయాల గురించి వదిలేసి పూర్తిగా ఆమె సినిమాల గురించి చర్చించుకుంటున్నారు. ఇది ఆమెకు కొంత వరకు ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు. విడాకుల బాధలో ఉన్న  ఆమెకు కచ్చితంగా ఈ మూవీ చాలా రిలీఫ్‌ ఇస్తుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment