Genelia : టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న హాసిని..!

June 18, 2022 4:30 PM

Genelia : ఒకప్పుడు బొమ్మ‌రిల్లు మూవీలో హాసినిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న జెనీలియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అప్ప‌ట్లో దాదాపుగా యంగ్ హీరోలు అంద‌రితోనూ ఈమె న‌టించింది. అయితే 2012లో నా ఇష్టం అనే సినిమాతో ఈమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అనంత‌రం వివాహం చేసుకుని పిల్ల‌ల్ని క‌ని సంతోషంగా జీవితం గ‌డుపుతోంది.

ఇక గ‌తేడాది నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో జెనీలియా స‌డెన్ గా క‌నిపించి ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈమె అప్ప‌ట్లో మంచు విష్ణుతో క‌నిపించింది. ఆయ‌న ఎన్నిక‌ల కోసం ఈమెను ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ర‌ప్పించారు. ఖ‌ర్చుల‌న్నీ ఆయ‌న‌నే భ‌రించారు. అయితే ఆ త‌రువాత జెనీలియా మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే తెలుగు తెర‌కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ప్ర‌ముఖ మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా వ‌స్తున్న క‌న్న‌డ‌, తెలుగు ద్విభాషా చిత్రంలో జెనీలియా న‌టిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె మ‌ళ్లీ టాలీవుడ్‌లో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

Genelia will be grand re entry into Tollywood
Genelia

ఇక ఈ మూవీలో జెనీలియా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా క‌నిపించ‌నుంది. ఈ మూవీలో ఈమె పాత్ర కీల‌క‌మ‌ని తెలుస్తోంది. అందుక‌నే మ‌ళ్లీ ఈమె సినిమాల్లో క‌నిపించేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలిసింది. ఇక జెనీలియా ఇండ‌స్ట్రీని వ‌దిలి 10 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీతో మ‌రోమారు సినిమాల్లో సంద‌డి చేయ‌నుంది. ఇక ఈ మూవీలో కిరీటికి జోడీగా Pelli SandaD బ్యూటీ శ్రీ‌లీల న‌టిస్తుండ‌గా.. యాక్ష‌న్ రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో క‌న్న‌డ యాక్ట‌ర్ ర‌విచంద్ర మ‌రో కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment