గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Ganesh Chaturdhi 2023 : ఈ సంవత్సరం వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలి..? మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది..?

Ganesh Chaturdhi 2023 : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు హిందువులందరూ వినాయకుడి పూజ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్న…

Ganesh Chaturdhi 2023 : ఈ సంవత్సరం వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలి..? మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది..?

Ganesh Chaturdhi 2023 : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు హిందువులందరూ వినాయకుడి పూజ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్న వాళ్ల మొదలు పెద్దవాళ్ల వరకు అందరికీ వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం. దాదాపు మూడు రోజుల నుండి 11 రోజుల వరకు ఈ పండుగని జరుపుతారు. వినాయకుడు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున పుట్టాడు. ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చిందా అని చాలామంది పదే పదే పండితుల్ని అడగడం, పంచాంగాలని తిరగేయడం చేస్తున్నారు.

అయితే ఈ సంవత్సరం పండుగ ఎప్పుడు వచ్చిందో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీతోపాటు 19న కూడా తిథి వుంది. వినాయక చవితిని కొందరు 18న జరుపుతుండగా, కొందరు 19న జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 28న నిమజ్జనం చేస్తారు. పంచాంగం ప్రకారం తిథి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటలకి మొదలయ్యి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8:43 గంటలకి ముగుస్తుంది.

Ganesh Chaturdhi 2023 what is the date and muhurtham
Ganesh Chaturdhi 2023

కనుక సెప్టెంబర్ 19న వినాయక చవితి జరుపుకోవాలని అంటున్నారు. కానీ కాణిపాకంలో, భాగ్యనగరంలో సెప్టెంబర్ 18న చేస్తున్నారు. నవరాత్రుల‌లో కూడా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. 11వ రోజు నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జ‌నం చేస్తారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన గరికను కచ్చితంగా పెట్టాలి. అలాగే నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు చెరుకుతోపాటు పండ్లని కూడా నైవేద్యం పెట్టాలి.

చాలామంది వినాయక చవితి నాడు పాలవెల్లి కడుతూ ఉంటారు. పాలవెల్లకి రకరకాల పండ్లు కట్టాలి. మొక్కజొన్న పొత్తులు, మారేడు కాయ, వెలగ వంటివి కూడా పెడుతూ ఉంటారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఎర్రమందారాలు, ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది. ఇలా వినాయకుడిని ఆరాధిస్తే వినాయకుడు మీ కోరికలని నెరవేరుస్తాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి