గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Loans : అప్పుల బాధల నుండి బయటపడాలంటే.. ఇలా చేయండి..!

Loans : అప్పుల బాధలతో మీరు సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. కొంతమంది అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలదు. సంపాదించినదంతా చేతికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం…

Loans : అప్పుల బాధల నుండి బయటపడాలంటే.. ఇలా చేయండి..!

Loans : అప్పుల బాధలతో మీరు సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. కొంతమంది అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలదు. సంపాదించినదంతా చేతికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం మంచిది. మీ సంపాదన మీ చేతుల్లోనే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.

పురాతన కాలం నుండి చాలా మంది పాటిస్తున్న పద్ధతులు ఇవి. వీటిని పాటించడం వలన పరిష్కారం దొరుకుతుంది. ఇలా కనుక చేశారంటే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. లక్ష్మీ దేవికి రోజూ నేతితో దీపం పెడితే డబ్బులు వస్తాయి. అప్పుల బాధల నుండి బయటపడొచ్చు.

follow these remedies to get rid of Loans
Loans

పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో దానిని జార విడవండి. మీరు అనుకున్న కోరిక అప్పుడు తీరుతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులను దగ్గరగా చేసి, అందులోకి చూస్తే విష్ణు, లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని మీరు పొందొచ్చు. ప్రతి బుధవారం రెండు ఖాళీ కుండల్ని చిన్నవి తీసుకుని, ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాలపాటు చేస్తే చాలా మంచిది.

ప్రతి బుధవారం కూడా పాలతో చేసిన పరమానాన్ని లక్ష్మీదేవికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణి వేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి, కనకధార స్తోత్రాన్ని చదివితే కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇలా అప్పుల బాధలని తీర్చుకోవచ్చు. చీమలకి చక్కెర వేస్తూ ఉండడం వలన కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి