Samantha : సమంత నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..?

November 18, 2021 12:45 PM

Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ సమంత.. తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక.. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తమిళ దర్శకులతో రెండు ద్విభాషా సినిమాలను ఒప్పుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నిర్ణయంపై అటు దర్శకులతోపాటు ఇటు సామ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

fans are not happy on Samantha decision

సమంత ఈ సినిమాతో ఫస్ట్ స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె కెరీర్ ని ఫుల్ బిజీగా మార్చుకోవడానికి మలయాళం సినిమా కూడా ఒప్పుకుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కి హీరోయిన్ సమంత యశోద అనే సినిమాకి డేట్స్ ఇచ్చారట. ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజ్ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఇక సామ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఎందుకంటే తమిళ సినిమాలంటే కొంతవరకు అర్థమవుతాయి గానీ మలయాళం అంటే బహుశా కష్టం అని అనుకుంటున్నారట. సమంత హీరోయిన్ గా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఉన్ని ముకుందన్ యాక్ట్ చేశారు. అలాంటి నటుడి పక్కన సామ్ యాక్ట్ చేయడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అతనికి అంత స్టార్‌ డమ్‌ లేదు కనుక సమంత అతని పక్కన చేయడం ఏంటి ? అనుకుంటున్నారట. ఈ విషయంలోనే ఫ్యాన్స్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా సామ్ మాత్రం తన కెరీర్ ని ఇండియా వైడ్ గా ఫోకస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో సమంత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment