గురువారం, జూన్ 11, 2026
వినోదం

Fahadh Faasil : పుష్ప విల‌న్ రియ‌ల్ లైఫ్ ప్రేమ క‌థ గురించి తెలుసా.. ఎన్ని ట్విస్టులో..!

Fahadh Faasil : సాధారణంగా పురుషుల విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు. సరిగ్గా ఇదే మాట మళ‌యాళ నటుడు ఫహద్ ఫాజిల్ చెబుతూ తన లైఫ్ లోకి భార్య నజ్రియా వచ్చాక తన జీవితమే పూర్తిగా మారిపోయిందని…

Fahadh Faasil : పుష్ప విల‌న్ రియ‌ల్ లైఫ్ ప్రేమ క‌థ గురించి తెలుసా.. ఎన్ని ట్విస్టులో..!

Fahadh Faasil : సాధారణంగా పురుషుల విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు. సరిగ్గా ఇదే మాట మళ‌యాళ నటుడు ఫహద్ ఫాజిల్ చెబుతూ తన లైఫ్ లోకి భార్య నజ్రియా వచ్చాక తన జీవితమే పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. తన సక్సెస్ లో నజ్రియా పాత్ర ఎంతో ఉందని నజ్రియా హెల్ప్ లేకుండా తాను ఏ పని చేయలేనని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.

నజ్రియాను ప్రేమించి పెళ్లాడిన ఫాజిల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నజ్రియాతో తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.అందరిలాగే ఒకసారి తాను లవ్ లెటర్ తోపాటు ఉంగరం పెట్టి నజ్రియాకు ఇవ్వడంతో మా ప్రేమకథ మొదలైంది. అయితే తన ప్రపోజల్ కు నజ్రియా ఎస్ చెప్పలేదని నో చెప్పకపోవడంతో టెన్షన్ పడ్డానని చెప్పాడు. బెంగళూరు డేస్ సినిమాతోపాటు మరికొన్ని సినిమాలు చేసేటప్పుడు నజ్రియా చుట్టూ తిరగడం తనకు చాలా నచ్చేదని, తన కోసం నజ్రియా కొన్ని వదులుకుందని అవి వదులుకోవడం వల్ల తాను చాలా బాధ పడినట్లు తెలిపారు.

Fahadh Faasil marriage interesting facts
Fahadh Faasil

పైగా అప్పట్లో మానసికంగా తాను స్ట్రాంగ్ కాదని, అలాంటి టైమ్ లో నజ్రియా తనకు ధైర్యం చెప్పిందని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు. ఇక తెలుగులో ఇప్పటివరకు ఫాజిల్ ఒక్క సినిమాలో కూడా చేయకపోయినా, ప్రేక్షకుల్లో మాత్రం నటుడిగా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో పుష్ప మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. కాగా రాజా రాణి అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి నజ్రియా పరిచయమైంది. తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ నజ్రియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగానే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి