గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Evelyn Sharma : బిడ్డ‌కు బ‌హిరంగంగా పాలిస్తే త‌ప్పేంటి..? నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు సాహో బ్యూటీ కౌంట‌ర్‌..!

Evelyn Sharma : సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసే పోస్టులు కొన్ని సంద‌ర్భాల్లో వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. అయితే కొన్ని సార్లు వారు ఎలాంటి పొర‌పాటు చేయ‌క‌పోయినా.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతుంటారు. తాజాగా బాలీవుడ్ న‌టి ఎవ్లిన్ శ‌ర్మ‌కు…

Evelyn Sharma : బిడ్డ‌కు బ‌హిరంగంగా పాలిస్తే త‌ప్పేంటి..? నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు సాహో బ్యూటీ కౌంట‌ర్‌..!

Evelyn Sharma : సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసే పోస్టులు కొన్ని సంద‌ర్భాల్లో వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. అయితే కొన్ని సార్లు వారు ఎలాంటి పొర‌పాటు చేయ‌క‌పోయినా.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతుంటారు. తాజాగా బాలీవుడ్ న‌టి ఎవ్లిన్ శ‌ర్మ‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తాను త‌ల్లి పాలు ఎంత ముఖ్య‌మో తెలియజేస్తూ పెట్టిన పోస్టు కొంద‌రికి న‌చ్చక‌పోగా.. వారు ఆమెను విమ‌ర్శిస్తున్నారు.

Evelyn Sharma counters those who trolled her for breastfeeding a child

ఎవ్లిన్ శ‌ర్మ త‌న 2 నెల‌ల కుమార్తె అవా భిండికి పాలిస్తూ దిగిన ఓ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. త‌ల్లిపాలు బిడ్డ‌కు ఎంత ముఖ్య‌మో ఆమె ఆ పోస్టులో తెలియ‌జేసింది. అయితే ఆమె ఆ పోస్టు పెట్టినందుకు కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి ప్ర‌యివేటు ఫొటోల‌ను కూడా షేర్ చేయాలా ? అవ‌స‌ర‌మా ? అని కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్ల‌కు ఆ న‌టి స్పందించింది.

తాను త‌ల్లి పాల ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ ఆ పోస్టు పెట్టాన‌ని.. ఇందులో ప్ర‌యివేటు ఏముంద‌ని ఆమె ప్ర‌శ్నించింది. బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అంటే త‌ల్లికి పున‌ర్జ‌న్మ లాంటిద‌ని, పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు ఎంత ముఖ్య‌మో తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతోనే నిర్మొహ‌మాటంగా తాను ఆ పోస్ట్ పెట్టాన‌ని.. ఇందులో త‌ప్పేముంద‌ని.. తల్లులంద‌రూ త‌మ పిల్ల‌ల‌కు క‌చ్చితంగా పాలివ్వాల‌ని.. న‌టి ఎవ్లిన్ శ‌ర్మ త‌నపై విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Evelyn Sharma (@evelyn_sharma)

కాగా ఎవ్లిన్ శ‌ర్మ మే 15, 2021వ తేదీన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన తుషాన్ భిండి అనే ఓ డెంటల్ స‌ర్జ‌న్‌ను వివాహం చేసుకుంది. త‌రువాత న‌వంబ‌ర్ 12, 2021వ తేదీన బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ శిశువుకు వారు అవా భిండి అని నామ‌క‌ర‌ణం చేశారు. గ‌తంలో ఎవ్లిన్ శ‌ర్మ.. యే జ‌వానీ హై దీవానీ, యారియా, జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్, కుచ్ కుచ్ లోచా హై అనే చిత్రాల్లో న‌టించింది. చివ‌రిగా సాహో చిత్రంలోనూ ఈమె క‌నిపించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి