గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ షోలో తొలిసారి రూ.1 కోటి గెలుచుకున్న పోలీస్ ఆఫీస‌ర్..!

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. జెమిని టీవీలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా…

Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ షోలో తొలిసారి రూ.1 కోటి గెలుచుకున్న పోలీస్ ఆఫీస‌ర్..!

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. జెమిని టీవీలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే కార్యక్ర‌మంతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇక్కడ మనీతోపాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఈ షో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

Evaru Meelo Koteeshwarulu one police officer won rs 1 crore in this show

అయితే ఈ షోలో ఇప్పటి వరకూ హాట్ సీట్ లో కూర్చుకున్న ఎవరూ కూడా రూ.1 కోటి ప్రశ్న వరకూ చేరుకోలేదు. అయితే తొలిసారిగా ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్‌ అధికారి కోటి రూపాయలు గెలుచుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఆ వ్య‌క్తిని మాత్రం రివీల్ చేయ‌లేదు. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నారు.

https://www.youtube.com/watch?v=vJPb35sZCKw

రామ్ చరణ్ తో మొదలైన ఈ షోలో ఎంతో మంది సామాన్యులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. సమంత, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు గెస్ట్‌లుగా సందడి చేశారు. త్వరలో మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన షో కూడా ప్రసారం కానున్నదని తెలుస్తోంది. ఈ సీజన్ ను నవంబర్‌ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు.. అని టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి