గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వరులు (EMK).. అన్ని ఎపిసోడ్స్‌ షూటింగ్ పూర్తి చేసిన ఎన్‌టీఆర్‌..!

Evaru Meelo Koteeshwarulu : జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు (EMK) షోకు గాను ఎన్‌టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. దసరా సందర్భంగా సమంతకు…

Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వరులు (EMK).. అన్ని ఎపిసోడ్స్‌ షూటింగ్ పూర్తి చేసిన ఎన్‌టీఆర్‌..!

Evaru Meelo Koteeshwarulu : జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు (EMK) షోకు గాను ఎన్‌టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. దసరా సందర్భంగా సమంతకు చెందిన స్పెషల్‌ ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. అయినప్పటికీ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రేటింగ్స్‌ రావడం కష్టంగా మారింది. అయితే ఈ షోకు గాను ఎన్‌టీఆర్‌ అన్ని ఎపిసోడ్స్‌ షూటింగ్‌ పూర్తి చేశారు.

Evaru Meelo Koteeshwarulu EMK all episodes shooting completed by NTR

ఎవరు మీలో కోటీశ్వరులు షో నవంబర్‌ మొదటి వారం వరకు ప్రసారం కానుంది. అయితే ఎన్‌టీఆర్‌ అన్ని ఎపిసోడ్స్‌కు చెందిన షూటింగ్‌ను పూర్తి చేశారు కనుక ఇకపై ఆ ఎపిసోడ్స్‌ ముగిసే వరకు ప్రసారం చేస్తారు. ఆ తరువాత సీజన్‌ను ఎప్పుడు ప్రారంభించేది, హోస్ట్‌గా ఎవరు వచ్చేది.. తరువాత వెల్లడిస్తారు. కానీ తరువాత సీజన్‌కు కూడా ఎన్‌టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకుంటారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ఈ షోకు రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివ కూడా గతంలో గెస్ట్‌లుగా వచ్చారు. మోహన్‌ బాబు, తమన్‌, దేవిశ్రీప్రసాద్‌ వంటి వారితోనూ పలు ఎపిసోడ్స్‌ చేశారు. అయితే ఆ ఎపిసోడ్స్‌ ప్రసారం కావల్సి ఉంది. వాటిని దీపావళి రోజు ప్రసారం చేస్తారని తెలుస్తోంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆరంభంలో అద్భుతమైన రేటింగ్స్‌ వచ్చాయి. కానీ ఆ రేటింగ్స్‌ తరువాత వారాల్లో నిలబడలేదు. దీంతో పలువురు సెలబ్రిటీలతో ప్రయత్నం చేశారు. అవి కూడా విఫలం అయ్యాయి. ఇక ఎన్‌టీఆర్‌ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి