గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Eevaru Meelo Koteeswarulu : ఇక త‌మ‌న్నా వంతు.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో సంద‌డి ?

Eevaru Meelo Koteeswarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు ఎంత మంది సెల‌బ్రిటీల‌ను తీసుకువ‌చ్చినా షో రేటింగ్స్ మాత్రం పెర‌గ‌డం లేదు. నానాటికీ త‌గ్గుతూనే ఉన్నాయి. దీంతో ఇంకొంత మంది పేరున్న సెల‌బ్రిటీల‌ను జెమినీ టీవీ యాజ‌మాన్యం…

Eevaru Meelo Koteeswarulu : ఇక త‌మ‌న్నా వంతు.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో సంద‌డి ?

Eevaru Meelo Koteeswarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు ఎంత మంది సెల‌బ్రిటీల‌ను తీసుకువ‌చ్చినా షో రేటింగ్స్ మాత్రం పెర‌గ‌డం లేదు. నానాటికీ త‌గ్గుతూనే ఉన్నాయి. దీంతో ఇంకొంత మంది పేరున్న సెల‌బ్రిటీల‌ను జెమినీ టీవీ యాజ‌మాన్యం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే షోకు మ‌హేష్‌బాబు, స‌మంత హాజ‌రు కాగా.. త్వ‌ర‌లో త‌మ‌న్నా కూడా హాజ‌రు కానుంద‌ని తెలుస్తోంది.

Eevaru Meelo Koteeswarulu tamannah to participate in the show

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో మ‌హేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ను ద‌స‌రా కానుక‌గా ప్రసారం చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే స‌మంత పాల్గొన్న ఎపిసోడ్‌ను దీపావ‌ళి రోజు ప్ర‌సారం చేస్తార‌ట‌. స‌మంత ఎపిసోడ్‌కు చెందిన ప్రోమోను అధికారికంగా విడుద‌ల చేయ‌లేదు, కానీ లీక్ అయింది. దీంతో ఆ ప్రోమో ట్రెండ్ అవుతోంది.

ఇక ఈ షోకు త‌మ‌న్నాను కూడా తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే త‌మ‌న్నా ఇప్ప‌టికే జెమినీ టీవీలో మాస్ట‌ర్ షెఫ్ ప్రోగ్రామ్ చేస్తుండ‌గా.. ఆమెను తీసేసి అన‌సూయ‌ను పెట్టుకున్నారు. దీంతో అన‌సూయ ఉన్న ఎపిసోడ్స్ త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే త‌మ‌న్నాను ఆ షోలో తీసేసినా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుకు గెస్ట్ గా తెచ్చి క‌నీసం ఈ షోకు అయినా రేటింగ్స్ పెంచాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగానైనా ఈ షో రేటింగ్స్ పెరుగుతాయో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి