Drushyam 2 Movie Review : వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న వెంకటేష్ ఇటీవల తన చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసిన వెంకీ ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, సంపత్ రాజ్, నదియా, నరేశ్, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్, షఫీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
2014లో వచ్చిన సూపర్‌హిట్ ఫిల్మ్ ‘దృశ్యం’కి రీమేక్ గా తెరకెక్కిన దృశ్యం 2లో రాంబాబుగా వెంకటేశ్ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు ? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తెలియాలంటే ‘దృశ్యం2’ చూడాల్సిందే! రాంబాబు (వెంకటేష్), వరుణ్ (నదియా కొడుకు) మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెట్టేసి, ఆ హత్య కేసులో ఎలాంటి క్లూ లేకుండా చేస్తాడు. ఆరేళ్లు గడుస్తున్నా వరుణ్ తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరు చంపారో తెలియక చస్తూ బతుకుంటారు. ఈ కేసులో రాంబాబుకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలను సేకరించి అతనిని అరెస్టు చేయడానికి పోలీస్ ఆఫీసర్ (సంపత్)ని నియమిస్తారు. ఈ సారి రాంబాబు ఎలా కాపాడుకుంటాడు.. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్ . ఇప్పటికే మలయాళంలో విడుదలైన చిత్రమే అయినా, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఫ్రెష్‌లుక్‌తో సినిమాను తీర్చిదిద్దాడు. వరుణ్ మిస్సింగ్ కేసు పూర్తయి ఆరేళ్లు అయిన తర్వాత నుంచి కథను మొదలు పెట్టిన దర్శకుడు ఆ కేసు భయాలతో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది చూపించాడు. వెంకీ తన కళ్లతో అద్భుతంగా ఎమోషన్స్‌ని పలికిస్తూనే, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మీనా ఈ సారి మంచి స్క్రీన్ స్పేస్‌ని పంచుకోవడంతో తన సపోర్టింగ్ రోల్‌ను పర్ఫెక్ట్‌గా పోషించింది. మిగతా వారందరూ తమ పాత్ర మేర నటించారు.
సినిమా స్లో మోషన్‌లో ప్రారంభం కావడం, కాసేపు కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు కొందరికి బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్‌లో పరిచయం చేసిన పాత్రలకు అసలైన ప్రయోజనం ఏమిటనేది చివరలో తెలుస్తుంది. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కొన్ని కీలక ఎమోషన్స్ దగ్గర తాను ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఎఫెక్టివ్ గా కూడా ఉంది.‘దృశ్యం 2’ సినిమా కచ్చితంగా అన్ని అంచనాలను అందుకుందనే చెప్పాలి. క్లీన్ అండ్ గ్రిప్పింగ్‌గా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…