Kidneys Clean : రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ జ్యూస్‌ను తాగండి.. కిడ్నీలు మొత్తం క‌డిగేసిన‌ట్లు శుభ్ర‌మ‌వుతాయి..!

July 22, 2022 10:08 AM

Kidneys Clean : మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అలాగే ర‌క్తాన్ని వ‌డ‌బోస్తాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ఇబ్బందులు వ‌స్తాయి. శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఇది మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక మ‌నం కిడ్నీలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఆ జ్యూస్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక క్యారెట్‌, ఒక కీర‌దోస‌ను తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. వీటికి ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను క‌ల‌పాలి. అనంత‌రం అన్నింటినీ క‌లిపి మిక్సీలో వేసి జ్యూస్‌లా ప‌ట్టుకోవాలి. దీన్ని వ‌డ‌క‌ట్టి అందులో ఒక గ్లాస్ జ్యూస్ తీసి దాంట్లో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఈ జ్యూస్‌ను ప‌ర‌గ‌డుపునే తాగాలి. త‌రువాత 30 నిమిషాలు ఆగి బ్రేక్ ఫాస్ట్ చేయ‌వ‌చ్చు. ఇలా రోజూ చేయాలి.

drink this juice daily empty stomach for Kidneys Clean
Kidneys Clean

ఈ విధంగా జ్యూస్‌ను త‌యారు చేసి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతాయి. అయితే దీన్ని క‌నీసం 15 రోజుల పాటు రోజూ తాగితే మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. 15 రోజుల పాటు తాగాక 7 రోజులు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ 15 రోజుల పాటు తాగాలి. ఇలా చేస్తుండ‌డం వ‌ల్ల కిడ్నీలు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంటాయి. దీంతో కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవ‌చ్చు. శ‌రీరంలోని వ్య‌ర్థాలు అన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now