Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆయన తన భార్య అన్నా లెజినోవాతో ఉంటున్నారు. అయితే అంతకు ముందు ఆయన రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలం పాటు వీరు సహజీవం చేశారు. పిల్లల్ని కూడా కన్నారు. తరువాతే వీరికి పెళ్లి జరిగింది. ఆ తరువాత వీరు విడిపోయారు. అప్పటి నుంచి పిల్లలు అకీరా నందన్, ఆద్యలు తల్లి రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నారు.
అయితే విడివిడిగా ఉంటున్నప్పటికీ పవన్ తన పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. ఇటీవలే అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. దీనికి రేణు దేశాయ్ కూడా వచ్చారు. అయితే తాజాగా వీరి రిలేషన్‌పై వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ బాంబు పేల్చారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
పవన్ కల్యాణ్ 2007లో తనకు, అకీరా నందన్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టులోనే చెప్పాడు. నేను అబద్దం చెప్పట్లేదు. సెప్టెంబర్ 5, 2007 నాటి పిటిషన్ నంబరు ఓపీ 590/2007లో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చెప్పాడు. రేణూ దేశాయ్ తో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో అకీరా నందన్ కు జన్మనిచ్చావా అని కోర్టు అడిగినప్పుడు తనకు, అకీరాకు ఎలాంటి రిలేషన్ లేదని ఆయన కోర్టుకు తెలిపాడు.. అంటూ నాగార్జున యాదవ్ కామెంట్స్ చేశారు.
కావాలంటే ఆ పిటిషన్ నంబర్ ఓపెన్ చేసి చూడండి, ఈ విషయం మీకే తెలుస్తుంది.. అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ప్రస్తుతం దుమారాన్ని రేపుతోంది. కాగా 2004లో అకీరా నందన్ జన్మించగా 2007లో కోర్టులో పవన్ ఈ విషయం చెప్పాడు.. అంటూ నాగార్జున యాదవ్ వెల్లడించారు. ఇక ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఇందుకు ఏమని రిప్లై ఇస్తారా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…