Nagarjuna : యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. వీరిద్దరూ కలిసి సంగీతం అందించిన చివరి మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథా బలం ఉన్న సినిమా కావడం.. దీనికి ఈవీవీ మార్కు కామెడీ తోడవడంతో ఈ సినిమా బంపర్ హిట్ అయింది.
అయితే ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్ర పూర్తిగా ఊరమాస్ కాగా రెండో పాత్ర చాలా సాఫ్ట్ అయినది. ఈ మూవీలో నాగార్జున డ్యుయల్ రోల్‌లో ఫుల్ లెంగ్త్‌లో కనిపిస్తారు. అయితే ఇద్దరినీ చూపించాల్సిన వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా డూప్‌ను వాడాల్సిందే. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. కనుక డ్యుయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్‌లో ఏ నటున్ని లేదా నటిని అయినా చూపించాలంటే అది మేకర్స్‌కు కత్తి మీద సామే అయ్యేది.
ఇక హలో బ్రదర్ సినిమాలో నాగార్జున రెండు క్యారెక్టర్లు ఒకేసారి తెరమీద కనిపించిన సమయంలో ఒక డూప్‌ను వాడారు. ఆయన ఎవరంటే.. నటుడు శ్రీకాంత్. అవును.. హలో బ్రదర్‌లో నాగార్జునకు శ్రీకాంత్ డూప్‌లా నటించారు. ఈ విషయాన్ని తాజాగా జరుగుతున్న బిగ్‌బాస్ షోలో నాగార్జుననే స్వయంగా వెల్లడించారు. ఇక వీరిద్దరూ కలిసి ఈవీవీ సినిమా వారసుడులోనూ కనిపించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పర్సనాలిటీ నాగార్జునకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనే హలో బ్రదర్‌లో నాగార్జునకు డూప్‌గా శ్రీకాంత్ నటించారు. ఇక నాగార్జున తన కెరీర్‌లో ఫుల్ లెంగ్త్ డ్యుయల్ రోల్ ఉన్న సినిమాలు 4 చేశారు. వాటిల్లో హలో బ్రదర్ ఒకటి. ఇది ఘన విజయం సాధించి అప్పట్లో నాగార్జునకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అలాగే ఈవీవీ, ఇతర నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…