Samantha : స‌మంత ధ‌రించిన ఈ స్కీయింగ్ జాకెట్ ధ‌ర ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

January 31, 2022 9:07 AM

Samantha : న‌టి స‌మంత గ‌త 10 రోజుల కింద‌ట స్విట్జ‌ర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన విష‌యం విదిత‌మే. మంచు ప‌ర్వ‌తాల్లో స‌మంత స‌ర‌దాగా గ‌డిపింది. అలాగే అక్క‌డ మంచుపై స్కీయింగ్ కూడా చేసింది. అనేక సార్లు ఆమె ఫెయిల్ అయిన‌ప్ప‌టికీ కేట్ అనే శిక్ష‌కురాలి స‌హాయంతో స‌మంత ఎట్ట‌కేల‌కు స్కీయింగ్ చేయ‌డం నేర్చుకుంది. ఇక ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోల‌ను, వీడియోల‌ను స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంది.

do you know the cost of Samantha  skiing jacket
Samantha

స్విట్జ‌ర్లాండ్‌లో స‌మంత రోజుకు 6 గంట‌ల పాటు స్కీయింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఉన్న స్కిల్స్‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. ఇక స్కీయింగ్ చేసేట‌ప్పుడు ఆమె ఒక ఎల్లో క‌ల‌ర్ జాకెట్‌ను ధ‌రించింది. అది టోనీ సెయిల‌ర్ జాకెట్ కాగా దాని ధ‌ర రూ.75వేలు. ఇక కొన్ని వీడియోల్లో ఆమె బ్లాక్ జాకెట్ ధ‌రించి క‌నిపించింది. దాని ధ‌ర ఏకంగా రూ.1.20 ల‌క్ష‌లు కాగా అది మాన్‌క్లెర్ బ్రాండ్‌కు చెందిన‌ది. ఈ క్ర‌మంలోనే స‌మంత ధ‌రించిన స్కీయింగ్ జాకెట్ల ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Samantha : ఐట‌మ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్లు..

ఇక స‌మంత ఇటీవ‌లే పుష్ప మూవీలో ఊ అంటావా సాంగ్‌తో అలరించింది. ఆ ఒక్క పాట చేసినందుకే ఆమెకు ఎంత‌గానో పేరు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ప‌లు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్లు వ‌స్తున్నాయి.

స‌మంత ప్ర‌స్తుతం శాకుంత‌లం, య‌శోద అనే సినిమాలు చేస్తోంది. అలాగే మ‌రో హాలీవుడ్‌, బాలీవుడ్ మూవీలతోపాటు ఓ థ్రిల్ల‌ర్ సిరీస్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now