Arya Movie : ఆర్య మూవీ వెనుక ఇంత కథ ఉందా.. ఆ స్టోరీని అంతమంది స్టార్స్ రిజెక్ట్ చేశారా..?

October 11, 2022 8:27 AM

Arya Movie : పుష్పతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. మొదట లెక్కల మాస్టర్ గా ఉన్న సుకుమార్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించి, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేసే స్థాయికి ఎదిగాడు. తన మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. 4 కోట్లు పెట్టి తీసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా నిల‌బెట్టిన చిత్రం ఆర్య. అయితే ఈ చిత్రానికి ముందు ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.

ఇక సుకుమార్ దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. ఈ సినిమా స‌మయంలో దిల్ రాజు సుకుమార్ లోని క‌సిని ప‌సిగ‌ట్టాడట. అంతే కాకుండా దిల్ సినిమా హిట్ అయితే నీకు ఆఫ‌ర్ ఇస్తా.. క‌థ రెడీ చేసుకో అంటూ బంప‌రాఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. దిల్ సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో స‌కుమార్ ను ఆఫీస్ కు పిలిపించుకుని క‌థ న‌చ్చింది. మ‌నం సినిమా చేద్దామ‌ని హామీ ఇచ్చాడ‌ట‌. హీరోని వెతికే ప‌నిలో మొద‌ట‌గా ర‌వితేజ‌, నితిన్, ప్ర‌భాస్ ల‌కు క‌థ‌ను వినిపించాడ‌ట‌. కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా క‌థ‌ను రిజెక్ట్ చేశారు.

do you know the actors who rejected Arya Movie
Arya Movie

ఆ త‌ర‌వాత కొత్త‌వాళ్ల‌తో చేస్తే బాగుంటుందేమోన‌ని అనుకున్నాడ‌ట‌. ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జ‌న్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ త‌న క‌థ‌లో బ‌న్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పాడ‌ట‌. ఇక దిల్ రాజు వెంట‌నే బ‌న్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత క‌థ వినిపించాడ‌ట‌. దాంతో అల్లు అర్జున్ గంగోత్రి త‌ర‌వాత 96 క‌థ‌లు విన్నాను అన్నీ రోటీన్ క‌థ‌లు అంటూ నీరసంగా చెప్పాడ‌ట‌. దిల్ రాజు మాది డిఫ‌రెంట్ క‌థ నీకు న‌చ్చుతుంద‌ని చెప్ప‌డంతో స‌రేన‌ని క‌థ విన్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆర్య సినిమాను ప‌ట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ గా మార‌గా, బ‌న్నీ స్టార్ గా ఎదిగాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment