Pooja Hegde : ఒక్క సినిమాకు పూజా హెగ్డె తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

June 7, 2022 11:46 AM

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ప్రాజెక్టుల‌తో ఎంతో బిజీగా ఉంది గ‌తేడాది ఈమె న‌టించిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ అమ్మ‌డికి ఒక్కో మూవీ షాక్‌ను ఇస్తోంది. మొద‌ట రాధేశ్యామ్‌, త‌రువాత బీస్ట్‌, ఇటీవ‌ల ఆచార్య మూవీలు అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యాయి. వీటిల్లో బీస్ట్ కాస్త ఫ‌ర్వాలేద‌నుకున్నా.. రాధేశ్యామ్‌, ఆచార్య మాత్రం బాగా నిరాశ ప‌రిచాయి. దీంతో పూజా హెగ్డెకు మ‌ళ్లీ ఐర‌న్ లెగ్ అన్న ముద్ర తిరిగి వ‌చ్చేసింది. అయితే ఈమెకు ఇప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేకున్నా.. ఈమె ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్న నేప‌థ్యంలో అవి హిట్ అవ్వాల‌ని కోరుకుంటోంది. లేదంటే పూజాకు మ‌ళ్లీ కెరీర్ ప్రారంభ రోజులు వ‌స్తాయ‌ని అంటున్నారు.

అయితే తాజాగా ఈ అమ్మ‌డు తెలుగు, హిందీలో ప‌లు వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటిల్లో పూరీ జ‌గ‌న్నాథ్ జేజీఎం (జ‌న‌గ‌ణ‌మ‌ణ‌) ఒక‌టి. దీనికి గాను ఈ అమ్మ‌డు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యున‌రేషన్‌ను తీసుకుంటోంద‌ట‌. అదే జ‌రిగితే తెలుగు సినీ చరిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత భారీ ఎత్తున రెమ్యున‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్లు ఎవ‌రూ లేరు. దీంతో పూజా హెగ్డె పేరు చరిత్ర‌లో నిలిచిపోతుంది. ఆ రూ.5 కోట్ల‌లో రూ.4 కోట్లు త‌న రెమ్యున‌రేష‌న్ కాగా.. రూ.1 కోటి త‌న స్టాఫ్ శాల‌రీలు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు వ‌సూలు చేస్తోంది.

do you know how much Pooja Hegde is taking remuneration for one film
Pooja Hegde

ఇక ఇదే కాకుండా ఈమె త్వ‌ర‌లోనే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ మూవీలో చేయ‌నుంది. అలాగే హిందీలోనూ రెండు ప్రాజెక్ట్స్‌కు ఓకే చేసింది. దీంతోపాటు ప‌వ‌న్‌తోనూ ఓ మూవీ చేయ‌నుంది. అయితే దీని గురించి మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా వ‌రుస‌గా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. పూజా హెగ్డె రెమ్యున‌రేష‌న్ పెర‌గ‌డం మాత్రం విశేష‌మ‌నే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now