Simhadri Movie : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో భిన్నమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ కాగా.. కొన్ని యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక కొన్ని మూవీలు అయితే ఆల్ టైమ్ హై వసూళ్లతో రికార్డులను సృష్టించాయి. అలాంటి చిత్రాల్లో సింహాద్రి ఒకటి. వాస్తవానికి ఈ మూవీని బాలయ్య చేయాల్సి ఉంది. అయితే ఆయన అప్పటికే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ చిత్రాలను చేసి ఉన్నారు. అందువల్ల ఆయన ఈ మూవీని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ కథ ఎన్‌టీఆర్ దగ్గరకు వెళ్లింది.
అలా సింహాద్రి కథను విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పగా.. దాన్ని బాలయ్యకు కాకుండా ఎన్‌టీఆర్‌కు సెట్ అయ్యే విధంగా రాజమౌళి కథను మార్చారు. అలా సింహాద్రి మొదలైంది. వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.దొరస్వామి రాజు, వి.విజయ్ కుమార్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కీరవాణి సంగీతం అందించగా.. ఇందులో ఎన్‌టీఆర్‌కు జోడీగా భూమిక, అంకిత నటించారు. ఈ క్రమంలోనే అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ మూవీకి గాను రూ.8.50 కోట్ల బడ్జెట్ కాగా మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ ఎన్‌టీఆర్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇందులో ఎన్‌టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్‌లో దుమ్ము రేపాడు. ముఖ్యంగా తాను అక్క పిలుచుకునే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొందరు వ్యక్తులను ఎన్‌టీఆర్ పరుగెత్తించి మరీ నరికి చంపుతాడు. ఇదే సీన్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమా ఎన్‌టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత కూడా రాజమౌళితో కలిసి తారక్ పలు సినిమాలు చేశాడు. అయినా ఈ మూవీనే ఎన్‌టీఆర్‌ను మాస్ హీరోను చేసిందని చెప్పవచ్చు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…