Samantha : స‌మంత ద‌గ్గ‌ర ఉన్న ఈ వ‌స్తువుల ఖ‌రీదు ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

April 28, 2022 5:08 PM

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత నిత్యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మ‌డు సినిమాలు, సోష‌ల్ మీడియా, టూర్స్ ఇలా ప్ర‌తి విష‌యంతోనూ అంద‌రి నోళ్ల‌లో నానుతుంటుంది. టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఏమాయ చేశావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసింది. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండి వ‌చ్చిన ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్‌గా మార‌డం విశేషం.

do you know about the cars of Samantha
Samantha

స‌మంత ఇటీవ‌ల తన ఫ‌స్ట్ జీతం రూ.500 అని తెలియ‌జేసింది. కెరీర్ మొద‌టి నుండి చాలా క‌ష్ట‌ప‌డుతూ వచ్చిన స‌మంత తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించింది. నేడు (ఏప్రిల్‌ 28) సమంత తన 35వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. బర్త్ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో సమంత ట్రెండ్‌ అవుతోంది. ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫ్యాషన్‌ రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ, ఫ్యాషన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది సమంత.

అందులో భాగంగా సమంత వాడే బ్యాగులు, వాటి వివరాలు, ధరలు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. సమంత వద్ద వైఎస్‌ఎల్‌ లవ్‌ బాక్‌ క్లచ్‌ బ్యాగ్‌, బట్టేగా వెనెటా పంచ్‌ స్లింగ్‌ బ్యాగ్‌, ప్రద వింటేజ్‌ బ్యాగ్‌, లూయిస్‌ వుయిట్టన్‌ బ్లీకర్‌బ్యాగ్‌, లూయిస్‌ వియుట్టన్‌ ట్విస్ట్ బ్యాగ్‌ వంటి లగ్జరీ బ్యాగులున్నాయి. వీటి ధర ఏకంగా రూ.1.40 ల‌క్ష‌లు ఉండడం విశేషం. స‌మంత వద్ద ఆరు లగ్జరీ కార్లున్నట్టు సమాచారం. వాటిలో రూ.72 లక్షల విలువలై జాగ్వర్‌ ఎక్స్ ఎఫ్‌ కారు, రూ.83 లక్షల విలువైన ఆడి క్యూ7, రూ.1.46 కోట్ల విలువైన స్వాంకీ పోర్చే కేమన్‌ కారుంది. వీటితోపాటు రూ.2.26 కోట్ల విలువ చేసే రేంజ్‌ రోవర్‌ కారు, రూ.2.55 కోట్ల మెర్సిడెస్‌ బెంజ్‌ జీ63, రూ.1.42 కోట్ల విలువలైన బీఎండబ్ల్యూ7 సిరీస్‌ కారు కూడా సమంత ఇంట్లో ఉండడం విశేషం. ఆమె మనోలో బ్లాక్‌ హై హీల్స్ వాడుతుంది. వీటి ధర ఏకంగా రూ.1 లక్ష ఉంటుందని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment