గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Evening : సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేస్తే.. అదృష్టం, ఐశ్వ‌ర్యం.. మీ వెంటే..!

Evening : కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ అనుకున్నది సాధించలేకపోతుంటారు. అలా జరగడానికి కారణం పనిచేసే చోటు అవ్వచ్చు. లేదంటే నివసించే చోటు అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయం, అపజయం రెండు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం…

Evening : సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేస్తే.. అదృష్టం, ఐశ్వ‌ర్యం.. మీ వెంటే..!

Evening : కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ అనుకున్నది సాధించలేకపోతుంటారు. అలా జరగడానికి కారణం పనిచేసే చోటు అవ్వచ్చు. లేదంటే నివసించే చోటు అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయం, అపజయం రెండు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం అస్సలు విజయమే అందదు. ఎప్పుడు చూసినా అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మీకు కూడా అపజయాలే కలుగుతున్నట్లయితే ఇలా చేసుకోండి. ఒకసారి వాస్తు ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. పరిహారాలు కూడా చేసుకోవడం మంచిది.

సూర్యాస్తమయం సమయంలో ఈ పరిహారాలు చేస్తే ధనవంతులు అవ్వచ్చు. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాల‌ కోసం అందరూ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టపడి పని చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసి రాదు. వాస్తు సరిగా లేకపోయినా కూడా నష్టం ఉంటుంది. అయితే ఇటువంటి వాటి నుండి ఎలా విముక్తి పొందాలి..? బయటికి ఎలా రావాలి..? అనే విషయాన్ని తెలుసుకుందాం.

do like this at Evening for luck and wealth
Evening

హిందూ ధర్మంలో ఉదయ సంధ్య, సాయం సంధ్య రెండూ కూడా ముఖ్యమైనవి. ఈ సమయంలో కొన్ని పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సంధ్య వేళలో అస్సలు నిద్రపోకూడదు. సంధ్య వేళలో నిద్రపోతే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుంది. సాయంకాలం చేసే పూజకి ఎంతో మహత్తు ఉంటుంది. సాయంత్రం సమయంలో పూజ మందిరంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి.

ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వెలుగు ఉండాలి. చీకటి నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తే కష్టాలు వస్తాయి. మనశ్శాంతి ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చీకటి లేకుండా చూసుకోవాలి. సూర్యాస్తమయం సమయంలో పెద్ద వాళ్ళని తలుచుకుని వారి యొక్క దీవెనల కోసం వేడుకోవాలి. వారి దీవెనలు లేకపోతే అడుగడుగునా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా మీరు వీటిని పాటిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం, అదృష్టం మీ వెంటే ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి