గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Devi Putrudu : దేవీపుత్రుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

Devi Putrudu : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్దయ్యాక హీరోగా చాలా మంది సక్సెస్ అయ్యారు. మరికొందరు…

Devi Putrudu : దేవీపుత్రుడు చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

Devi Putrudu : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్దయ్యాక హీరోగా చాలా మంది సక్సెస్ అయ్యారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించినప్పటికీ హీరోగా ప్రయత్నించి విఫలమయ్యారు. ల‌వ‌ర్ బాయ్ గా ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న త‌రుణ్ టాలీవుడ్ కు బాల‌న‌టుడుగా ప‌రిచ‌యం అయ్యాడు. న‌టి షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మై ఓయ్ సినిమాతో హిట్ కొట్టేసింది.

ఇక ప్ర‌స్తుతం తేజ స‌జ్జా, ఆకాష్ పూరీ, అశోక్ గ‌ల్లా కూడా ఒక‌ప్ప‌టి చైల్డ్ ఆర్టిస్టులే. అయితే 2001వ సంవత్సరం జనవరి 13న దేవీపుత్రుడు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంక‌టేశ్, సౌంద‌ర్య జంట‌గా న‌టించిన ఈ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. డిఫ‌రెంట్ క‌థ‌తో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్షకుల‌ను మెప్పించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు విడుదలకి ముందే సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాతో ఓ చిన్నారి కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

Devi Putrudu child artist see how is she now
Devi Putrudu

ఆ చిన్నారి పేరు వేగా తిమోతియా కాగా ఇప్పుడు ఆ బుడ్డ‌ది హీరోయిన్ లా మారిపోయింది. దేవీపుత్రుడులో తిమోతియా త‌న న‌ట‌న‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా త‌రువాత అంద‌రికీ దేవీపుత్రుడు చిన్నారిగా గుర్తిండిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ చిన్నారి ఎదిగిపోయి హీరోయిన్ ల‌ను మ‌రిపించేలా తయారయ్యింది. అవాక్కయ్యే అందంతో ఆక‌ట్టుకుంటోంది. దాంతో తిమోతియా ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం అంటున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి