గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Cumin Ajwain And Black Salt : ఈ మూడింటిలో రోజూ ఏదో ఒక్కటి తిన్నా చాలు.. ఎంతో మేలు జరుగుతుంది..!

Cumin Ajwain And Black Salt : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అయితే మన ఇంట్లో…

Cumin Ajwain And Black Salt : ఈ మూడింటిలో రోజూ ఏదో ఒక్కటి తిన్నా చాలు.. ఎంతో మేలు జరుగుతుంది..!

Cumin Ajwain And Black Salt : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అయితే మన ఇంట్లో కొన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

జీలకర్ర, వాము, నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జీలకర్ర, నల్ల ఉప్పు, వాముతో చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీలకర్రని తీసుకుంటే పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీలకర్రని తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు. జీలకర్ర తీసుకోవడం వలన గ్యాస్ వంటి బాధలు ఉండవు. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ జీలకర్రలో ఉంటాయి. కడుపునొప్పి వంటి బాధలు జీలకర్రతో తొలగిపోతాయి. జీలకర్రను తీసుకుంటే దంత సమస్యలు కూడా వుండవు. ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి వాము కూడా ఎంతో మేలు చేస్తుంది.

Cumin Ajwain And Black Salt take any one of these for many benefits
Cumin Ajwain And Black Salt

పంటి సమస్యల నుండి జీలకర్ర, వాము, నల్ల ఉప్పు కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు రక్తపోటుని కూడా తగ్గించగలవు. రక్తపోటును తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో కూడా ఉంచగలవు. యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఇతర పోషకాలు కూడా వీటితో పొందవచ్చు. వ్యాధులతో పోరాడడానికి, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని దూరంగా ఉంచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు కొవ్వుని కూడా తగ్గించగలవు. జీవక్రియలని కూడా పెంచగలవు. జీర్ణవ్యవస్థ పనితీరుని నియంత్రిస్తాయి. నల్ల ఉప్పు తీసుకుంటే ఉబకాయం కూడా తగ్గుతుంది. ఇలా మనం ఈ మూడింటితో ఈ బాధల నుండి బయట పడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి