Samantha : పరువు నష్టం కేసులో సమంతకు షాక్ ఇచ్చిన కోర్ట్..!

Samantha : గత కొద్ది రోజులుగా సమంత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె కూకట్ పల్లి కోర్టులో పలు యూట్యూబ్ ఛానల్స్‌పై పరువు నష్టం దావా పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపగా ఈ విచారణలో భాగంగా సమంతకు కోర్టు నుంచి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత తనని అప్రతిష్టపాలు చేస్తున్నారని సమంత పరువు నష్టం దావా పిటిషన్ వేసింది.

అయితే గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కోర్టు తీర్పును శుక్రవారంకు వాయిదా వేసింది. గురువారం కోర్టు సమయం ముగియడంతో తీర్పును వెల్లడించక పోవడమే కాకుండా సమంతా పిటిషన్ పై చురకలు అంటించింది. పరువు నష్టం దావా కింద పిటిషన్ వేసిన తర్వాత తను క్షమాపణ కోరాలి కానీ ఇలా డబ్బులను డిమాండ్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది.

ఇలా సమంత పిటిషన్ ను అత్యవసరంగా విచారించడానికి కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమంత నటిగా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఆమె పిటిషన్ ను ఎమర్జెన్సీ కింద విచారించాలని సమంత తరపున న్యాయవాది బాలాజీ కోర్టుకు విన్నవించారు.

ఆయన వాదనను విన్న తర్వాత కూకట్ పల్లి న్యాయమూర్తి కోర్టుకు అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భావన ఇక్కడ ఉండదని అన్నారు. సమంత కేసును అత్యవసర కేసుగా భావించి త్వరగా విచారించమని కోరడం కరెక్ట్‌ కాదని, అందరూ చట్టం ముందు సమానమేనని, ఇతర పరువు నష్టం కేసుల్లాగే ఈ కేసును కూడా విచారిస్తామని, మొత్తం ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతామని.. న్యాయస్థానం వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM