Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యికి ఊహించ‌ని షాక్.. అకౌంట్‌ను తొల‌గించిన ఇన్‌స్టాగ్రామ్‌..!

June 24, 2022 12:06 PM

Chinmayi : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హీరోయిన్లు ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. సోష‌ల్ మీడియాలో రోజూ వారు పెట్టే పోస్టుల‌కు గాను వారు ట్రోల్స్‌కు గుర‌వుతుంటారు. ఇక కొన్ని పోస్టులు వివాదాస్ప‌దం అవుతుంటాయి. దీంతో వారిపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. అయితే కొంద‌రు మాత్రం ఏమీ చేయ‌క‌పోయినా వారిపై ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు నిరంత‌రం వ‌స్తూనే ఉంటాయి. అలాంటి న‌టుల్లో చిన్మ‌యి ఒక‌రు. ఈమె సింగ‌ర్‌గానే కాక న‌టిగా కూడా రాణిస్తోంది. ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అయితే సింగర్ చిన్మ‌యికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆమె అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొల‌గించింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

సింగ‌ర్ చిన్మ‌యి తాజాగా ట్విట్ట‌ర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తన‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంద‌రు త‌మ న‌గ్న ఫొటోల‌ను పంపిస్తున్నార‌ని.. ఎంతో కాలంగా ఇది జ‌రుగుతుంద‌ని.. అయితే దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేశాన‌ని చెప్పింది. కానీ ఇన్‌స్టాగ్రామ్ వారు మాత్రం ఆ వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన‌, బాధితురాలు అయిన త‌న‌పైనే చ‌ర్య‌లు తీసుకుంద‌ని.. త‌న అకౌంట్‌ను తొల‌గించార‌ని చెప్పింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇంకో బ్యాక‌ప్ అకౌంట్‌ను క్రియేట్ చేయ‌డం జ‌రిగింద‌ని.. క‌నుక ఇక‌పై త‌న‌ను ఆ అకౌంట్‌లో ఫాలో కావాల‌ని కోరింది.

Chinmayi instagram account removed
Chinmayi

వాస్త‌వానికి చిన్మ‌యికి ఎప్పుడూ ఇలాంటి ఏదో ఒక చేదు సంఘ‌ట‌న ఎదుర‌వుతూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు వైర‌ల్ అవుతుంటాయి. స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌పై ఆమె పోరాటం చేస్తుంటుంది. దానికి సంబంధించి ఆమె పోస్టులు పెడుతుంటుంది. ఇక ఇటీవ‌లే చిన్మ‌యికి క‌వ‌లలు జ‌న్మించారు. ఈ క్ర‌మంలోనే వారి చేతులు ప‌ట్టుకున్న‌ట్లుగా ఉన్న ఫొటోల‌ను ఆమె షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment