గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Chamomile Tea : ఈ పూలతో చేసిన టీ గురించి మీకు తెలుసా..? దీన్ని తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి!

Chamomile Tea : చామంతి పూల టీ యా..! అవునా..! అని ఆశ్చర్య‌పోకండి..! మీరు విన్న‌ది నిజ‌మే..! చామంతి పూల నుంచి తీసిన కొన్ని ప‌దార్థాల‌తో త‌యారు చేసే పొడితో టీ పొడి త‌యారు చేస్తారు. అది అచ్చం…

Chamomile Tea : ఈ పూలతో చేసిన టీ గురించి మీకు తెలుసా..? దీన్ని తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి!

Chamomile Tea : చామంతి పూల టీ యా..! అవునా..! అని ఆశ్చర్య‌పోకండి..! మీరు విన్న‌ది నిజ‌మే..! చామంతి పూల నుంచి తీసిన కొన్ని ప‌దార్థాల‌తో త‌యారు చేసే పొడితో టీ పొడి త‌యారు చేస్తారు. అది అచ్చం సాధార‌ణ టీ పొడిని పోలి ఉంటుంది. అంటే.. ఇది కూడా గ్రీన్ టీలాగే ఉంటుంది. అయితే రూపంలోనే కాదు, చామంతి పూల టీ అందించే ఔష‌ధ గుణాలు కూడా గ్రీన్ టీలాగా అద్భుతంగా ఉంటాయి. ఈ క్ర‌మంలో చామంతి పూల టీని నిత్యం తాగుతూ ఉంటే గ్రీన్ టీ వ‌ల్ల పొందే బెనిఫిట్స్‌ను పొంద‌వ‌చ్చు. రుచి కూడా వెరైటీగా ఉంటుంది. మ‌రి చామంతి పూల టీ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల గురించి తెలుసుకుందామా.

చామంతి పూలతో తయారు చేసే టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. బాగా తలనొప్పిగా ఉంటే వెంటనే చామంతి పూల టీ తాగేయండి. దీంతో ఆ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చామంతి పూల టీ ఎంతగానో దోహదం చేస్తుంది. నిత్యం చామంతి పూల టీ తాగుతుంటే దాంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది.

Chamomile Tea benefits must take them daily
Chamomile Tea

డయాబెటిస్ ఉన్న వారికి కూడా చామంతి పూల టీ మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. చామంతి పూల టీని నిత్యం తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలు ఉండవు. మనస్సుకు రిలాక్సేషన్ ఇవ్వడంలో చామంతి పూల టీ ఉపయోగపడుతుంది. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి