Bigg Boss 5 : వారాలు గడుస్తున్నకొద్దీ బుల్లితెరపై బిగ్‌బాస్ జోరు పెరుగుతోంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని ప్రేక్షకులు ఇప్పుడు ఈ షోను తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వారాంతాలతోపాటు ఆపైన జరిగే నామినేషన్ ఎపిసోడ్‌లను కూడా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ షో 7 వారాలు పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ వారం మొత్తం 6 మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.
కాగా యాంకర్ రవి వరుసగా 8వ వారం కూడా నామినేట్ అయ్యాడు. కానీ ప్రతి వారం సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇక ఈ వారం కూడా రవి నామినేషన్స్‌లో నిలిచాడు. కానీ రవి ఈ వారం కూడా సేవ్ అవుతాడని తెలుస్తోంది. రవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా అతను సేవ్ అవుతాడని భావిస్తున్నారు.
ఇక రవి కాకుండా జశ్వంత్, లోబో, సిరి, శ్రీరామ్, మానస్‌లు నామినేషన్‌లో నిలిచారు. ఓట్ల పరంగా చూస్తే షణ్ముఖ్, రవి అందరికన్నా ముందే ఉన్నారు. వీరికి ఓట్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వీరితోపాటు శ్రీరామ్, మానస్‌లు కూడా ఈ వారం సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ వారిలో లోబో, సిరి ఇద్దరు మాత్రమే ప్రత్యేక డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా లోబోకే ఇంకా డేంజర్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఈ వారం ఎలిమినేట్ అవుతాడని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. దీంతో ఈసారి మగవారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే.. లోబో కచ్చితంగా నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చిన మగ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నారు. దీంతో ఈసారి మరో మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది. అదే నిజం అయితే లోబో కచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…