Bhairava Dweepam : భైర‌వ‌ద్వీపం సినిమా మొత్తంగా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

October 2, 2022 3:18 PM

Bhairava Dweepam : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన  హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది.

ఆదిత్య 369, భైరవద్వీపం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడంలో కూడా బాలయ్యకు సరిసాటి ఎవరూ లేరు. బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో భైరవద్వీపం సినిమా ఒకటి అని చెప్ప‌వచ్చు. భైరవద్వీపం చిత్రం అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సార్ బోర్డుకు కూడా భైరవద్వీపం చిత్రం షాక్ ఇచ్చింది. మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం.

Bhairava Dweepam final collections details you will be surprised
Bhairava Dweepam

అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే భైరవద్వీపం మూవీని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాకు ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా విడుదల చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ సెన్సార్ పూర్తయిన తర్వాత సెన్సార్ అధికారులు ఒక సూచన చేశారు. గుర్రాలు కింద పడిపోయిన సన్నివేశం మా వరకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ వన్యప్రాణుల సంరక్షణ సంఘం వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం ఆ గుర్రాలు పడిపోయే షాట్స్ తొలగించాల్సి వస్తుందని చెప్పారట. కానీ ఆ షాట్స్ వారి దృష్టిలోకి వెళ్ళలేదు.

ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో గుర్రాలు పడి పోయే విధానం చూస్తే మాత్రం వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు కచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఈ సన్నివేశంలో గుర్రాలు చాలా వేగంగా పరిగెడుతూ వస్తూ ఉంటాయి. షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి వాటి కాళ్ళకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు. ఆ వైర్లు తాకగానే గుర్రాలు కిందపడిపోతాయి. ఆ సమయంలో గుర్రాలు కాలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాస్త రిస్క్ తో కూడుకున్న సన్నివేశం ఇది.

సన్నివేశం పూర్తయిన వెంటనే గుర్రాలను అక్కడే ఉన్న వైద్యునికి చూపించి వాటికి చికిత్స చేయించేవారు. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎలాంటి గ్రాఫిక్స్, సెన్సార్ కట్స్ లేకుండా 14 ఏప్రిల్ 1994లో విడుదలైన భైరవద్వీపం చిత్రం చరిత్రలో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ మొత్తంగా రూ.14.4 కోట్ల గ్రాస్‌ను, రూ.8 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment