NTR : ఎన్టీఆర్‌కి బాల‌కృష్ణ చిన్న అల్లుడు స‌పోర్ట్‌..!

November 26, 2021 1:08 PM

NTR : ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై కొంద‌రు వైసీపీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఈ క్ర‌మంలో చాలా హ‌ర్ట్ అయిన చంద్ర‌బాబు మీడియా ముందు భోరున విల‌పించారు. దీంతో నంద‌మూరి ఫ్యామిలీతోపాటు టీడీపీ వ‌ర్గాలు వైసీపీ నేత‌ల‌పై విరుచుకు ప‌డ్డారు. బాల‌కృష్ణ అయితే త‌న ఫ్యామిలీతో క‌లిసి ప్రెస్ మీట్ పెట్టి నా సోద‌రి జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్ధార్ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

balakrishna son in law bharath supports NTR

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌తోపాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు కూడా స్పందించారు. అయితే ఎన్టీఆర్ ఎక్క‌డ కూడా ఎవ‌రి పేర్లు ఎత్తకుండా.. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మన సంస్కృతి కాదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మండిప‌డ్డారు. మేన‌ల్లుడిగా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ ఎన్టీఆర్‌ని దూషించారు.

టీడీపీ నేతలు కొంద‌రు కూడా ఎన్టీఆర్ రియాక్షన్‌ని తప్పుబట్టారు. అస‌లు విష‌యాన్ని మ‌రచిపోయి ఇప్పుడు టాపిక్ అంతా ఎన్టీఆర్ వైపుకు డైవ‌ర్ట్ అవుతుండ‌డంతో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంట‌ర్ అయ్యాడు. ఎన్టీఆర్ చాలా పరిణతితో కూడిన వాదన వినిపించారని, ఆయన స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించ దగినదని పేర్కొన్నారు. దీని గురించి చర్చించడం సరికాదని చెబుతూ ఈ ఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌‌ను అభినందించాలని భరత్ అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment