గురువారం, జూన్ 11, 2026
స‌మాచారం

బజాజ్ బైక్ కొనాలనుకునే వారికి షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అది కూడాబజాజ్ కంపెనీకి చెందిన బైక్ కొనాలి అని భావించే వినియోగదారులకు బజాజ్ మోటార్ కంపెనీ ఒక చేదు వార్త చెబుతోంది. టు వీలర్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన బజాజ్ మోటార్స్ కీలక నిర్ణయం…

బజాజ్ బైక్ కొనాలనుకునే వారికి షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అది కూడాబజాజ్ కంపెనీకి చెందిన బైక్ కొనాలి అని భావించే వినియోగదారులకు బజాజ్ మోటార్ కంపెనీ ఒక చేదు వార్త చెబుతోంది. టు వీలర్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన బజాజ్ మోటార్స్ కీలక నిర్ణయం తీసుకొని వినియోగదారులకు చేదు వార్తను తెలియజేస్తుంది. తాజాగా బజాజ్ కంపెనీ పాపులర్ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ధరను పెంచేసింది. ఈ బైక్ ధర రూ.6,100 పెరిగింది. ఈ ధరలు పెంచడంతో ప్రస్తుతం రూ.93,630 ఉన్న పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ రూ.99,730కు చేరింది. అయితే ఈ విధంగా బజాజ్ రేట్లను పెంచడానికి అసలు కారణం తెలియలేదు.

బజాజ్ కంపెనీ కేవలం పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ధరను మాత్రమే కాకుండా,పల్సర్ 125 బైక్ ధరను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ బైక్ ధర రూ.4,500 వరకు పెరిగింది.వేరియంట్ ప్రాతిపదికన బైక్ ధర పెంపు ఆధారపడి ఉంటుంది. దీంతో బజాజ్ బండి కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక చేదు వార్తగా మిగిలి ఉందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి