గురువారం, జూన్ 11, 2026
వినోదం

Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ చిన్న మిస్టేక్‌ను మీరు గ‌మ‌నించారా.. అలా ఎలా చేశారు..?

Attarintiki Daredi : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ని మ‌రింత రెట్టింపు చేసిన చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ…

Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ చిన్న మిస్టేక్‌ను మీరు గ‌మ‌నించారా.. అలా ఎలా చేశారు..?

Attarintiki Daredi : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ని మ‌రింత రెట్టింపు చేసిన చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథను పవ‌న్ క‌ళ్యాణ్ కి త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్ కాల్ లోనే వినిపించారంటా. స్టోరీ విని పవర్ స్టార్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో వెంట వెంట‌నే మూవీ సెట్స్ పైకి వెళ్లింది. సినిమాలో అత్త క్యారెక్టర్ మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ లో ఎవరిని ఎంపిక చేశారని త్రివిక్రమ్ పవన్ అడ‌గ‌డంతో… నదియా అని చెప్పగానే కన్విన్స్ అయ్యారట.

మరదలు క్యారెక్టర్ కోసం సమంత స్థానంలో మొదట ఇలియానాను తీసుకోవాలని భావించ‌గా, అప్ప‌టికీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఇలియానా నో చెప్పడంతో… ఆ స్థానంలో సమంతను తీసుకున్నారంట. ఇక ఈ సినిమాలో ఫారెయిన్ లొకేషన్స్ ను సెర్చ్ చేయడానికి మొదటి సారిగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్వయంగా స్పెయిన్ వెళ్లారని టాక్.. సుమారు 30 నుంచి 45 రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారంట. అన్ని కుద‌ర‌డంతో సినిమా మంచి విజ‌యం సాధించింది. 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి.

Attarintiki Daredi have you observed this small mistake
Attarintiki Daredi

సినిమాని అంతా ఆద్యంతంగా న‌డిపించిన త్రివిక్ర‌మ్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఓ సీన్ లో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే అదే సమయంలో అలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. దాంతో పవన్ కళ్యాణ్ రగిలిపోయి తన బౌన్సర్ లతో కొట్టిస్తాడు. అంతే కాకుండా తాను డ్రైవర్ కాదని తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు. ఇక కోపం లో కొట్టిన పవన్ ఆ తరవాత ఆలీ కి లక్షల డబ్బు ఉన్న ఒక సూట్ కేస్ ఇస్తాడు. అయితే అప్పటికే ఈ సూట్ కేస్ ను ఎం ఎస్ నారాయణ పవన్ కు తెరచి చూపించాడు. కానీ అలీ మాత్రం అదే సూట్ కేస్ ను తీసుకువెళ్ళి ఓపెన్ అవ్వడంలేదని చెబుతాడు. అస‌లు ఈ లాజిక్ అలా ఎలా మిస్ అయ్యావు అంటూ నెటిజ‌న్స్ త్రివిక్ర‌మ్‌ని అప్పుడ‌ప్పుడు విమ‌ర్శిస్తూ ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి