Asalem Jarigindi Review : ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగే.. అస‌లేం జ‌రిగింది.. మూవీ రివ్యూ..!

Asalem Jarigindi Review : క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న‌ చాలా చిత్రాలు మంచి వినోదం పంచ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లను రాబ‌డుతున్నాయి. తాజాగా శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా న‌టించిన ‘అస‌లేం జ‌రిగింది’ కూడా ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచేందుకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ? అంటే..

కథ..

1970- 80లలో తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల‌ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఓ అదృశ్య శక్తితో హీరో ఏ విధంగా పోరాడాడు.. అన్న కథనే ఈ మూవీలో చూపించారు. పూర్తి వివరాలు తెలియాలంటే.. వెండి తెరపై ఈ మూవీని చూడాల్సిందే.

 

అస‌లేం జ‌రిగింది ? చిత్రానికి ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ నిర్మించారు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ హారర్ థ్రిల్లర్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. టైటిల్‌లోనే సస్పెన్స్‌తో నింపేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ లభిస్తోంది.

తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల‌ ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. స‌స్పెన్స్ థ్రిల్లర్ ల‌వ్ స్టోరీగా ఈ మూవీ రన్‌ అవుతోంది. ‘అస‌లేం జరిగింది?’ మూవీని పూర్తిగా కొత్త కాన్సెప్టుతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. హార్రర్‌, థ్రిల్లర్‌ జోనర్‌లను ఇష్ట పడే ప్రేక్షకులకు ఈ మూవీ తప్పక నచ్చుతుంది.

విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్రకాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గవి పిళ్లై తదితర ప్రముఖ సింగ‌ర్లు పాడిన పాట‌ల‌కు అమెజాన్ మ్యూజిక్‌, స్పాటిఫై, జియోసావ‌న్‌, యాపిల్ మ్యూజిక్ వంటి మ్యూజిక్ ప్లాట్‌ఫార‌మ్స్ నుంచి చ‌క్కటి రెస్సాన్స్ వ‌స్తోంది. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ఫైన‌ల్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ఎస్‌.చిన్నా అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. సీన్లకు అనుగుణంగా సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేశాయి. హీరో శ్రీరాం ఈ సినిమాకు ప్రాణం పోశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మ‌హావీర్ స్వర‌క‌ల్పన అద్భుతంగా ఉంది.

రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.  ఆద్యంతం ప్రతి సీన్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. హారర్‌, థ్రిల్లర్‌ మూవీలను ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM