గురువారం, జూన్ 11, 2026
టెక్నాల‌జీ

Apple iPhone : ఇకపై ఐఫోన్‌ల‌లో సిమ్ కార్డు స్లాట్‌లు ఉండ‌వు..!

Apple iPhone : టెక్ దిగ్గ‌జ కంపెనీ యాపిల్ ఇప్ప‌టికే డ్యుయ‌ల్ సిమ్ ఐఫోన్ల‌ను విక్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ నుంచి త‌న ఐఫోన్ల‌లో యాపిల్ డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను అందిస్తూ వ‌స్తోంది. అయితే వాటిల్లో…

Apple iPhone : ఇకపై ఐఫోన్‌ల‌లో సిమ్ కార్డు స్లాట్‌లు ఉండ‌వు..!

Apple iPhone : టెక్ దిగ్గ‌జ కంపెనీ యాపిల్ ఇప్ప‌టికే డ్యుయ‌ల్ సిమ్ ఐఫోన్ల‌ను విక్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ నుంచి త‌న ఐఫోన్ల‌లో యాపిల్ డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను అందిస్తూ వ‌స్తోంది. అయితే వాటిల్లో ఫిజిక‌ల్ సిమ్ కార్డు స్లాట్ ఒక‌టే ఉంటుంది. రెండోది ఇ-సిమ్ స్లాట్‌. కాగా ఇక‌పై అందించే ఐఫోన్ల‌లో రెండింటినీ ఇ-సిమ్ రూపంలోనే అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంటే.. ఇక‌పై రానున్న ఐఫోన్ల‌లో ఫిజిక‌ల్ సిమ్ కార్డు స్లాట్ ఒక్క‌టి కూడా ఉండ‌ద‌న్న‌మాట‌.

Apple iPhone models will not have physical sim card slots

వ‌చ్చే ఏడాది.. అంటే.. 2022 సెప్టెంబర్ నుంచి కొత్త ఐఫోన్ మోడ‌ల్స్.. ఐఫోన్ 14 సిరీస్‌లో సిమ్ కార్డ్ స్లాట్‌ల‌ను యాపిల్ అందించ‌బోద‌ని తెలుస్తోంది. అయితే గ‌తంలో ఐఫోన్ 15 సిరీస్ నుంచి సిమ్ కార్డ్ స్లాట్‌ల‌ను తీసేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ అంత‌కు ఒక ఏడాది ముందుగానే.. అంటే.. వ‌చ్చే ఏడాది ఐఫోన్ 14 మోడ‌ల్స్ నుంచే సిమ్ కార్డ్ స్లాట్‌ల‌ను అందివ్వ‌ర‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో కొత్త ఐఫోన్ మోడ‌ల్స్‌లో అస‌లు సిమ్ కార్డ్‌ల‌కు స్లాట్స్ ఉండ‌వు. రెండు సిమ్ కార్డు స్లాట్స్ కూడా ఇ-సిమ్ టైప్‌లో ఉంటాయి. అంటే.. నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి నేరుగా నెట్‌వ‌ర్క్‌ను యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విష‌యాన్ని ఓ వెబ్‌సైట్‌లో ప్ర‌చురించారు. కానీ యాపిల్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి