Anjeer : అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో, పండ్ల రూపంలో.. రెండు రకాలుగా లభిస్తాయి. అయితే పండ్లుగా కన్నా డ్రై ఫ్రూట్స్ గానే ఇవి మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లను రోజూ రాత్రి నిద్రించే ముందు తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అంజీర్ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్నవారు ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
2. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఆస్తమా ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
4. అధిక బరువు సమస్య ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటుంటే బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
5. అంజీర్ పండ్లలో పొటాషియం, ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
అంజీర్ పండ్లను రాత్రి పూట నీటిలో 3-4 నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినవచ్చు. లేదా రాత్రి పూట 3-4 అంజీర్ పండ్లను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…