గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anasuya : సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన దుస్తులు ధ‌రించినా.. అన‌సూయపై కామెంట్స్‌.. కానీ..?

Anasuya : బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన హీరోయిన్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చేది అన‌సూయ పేరు. అనసూయ భరద్వాజ్ ఓ అందాల యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే…

Anasuya : సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన దుస్తులు ధ‌రించినా.. అన‌సూయపై కామెంట్స్‌.. కానీ..?

Anasuya : బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన హీరోయిన్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చేది అన‌సూయ పేరు. అనసూయ భరద్వాజ్ ఓ అందాల యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ కనుల విందు చేస్తోంది. ఈ అమ్మ‌డి ర‌చ్చ సోష‌ల్ మీడియాలో మాములుగా ఉండ‌దు. గ్లామ‌ర‌స్‌ ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. అయితే యాంకర్ అనసూయను, తన డ్రెస్ లను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కొత్తేమీ కాదు. తాను కూడా ఆ కామెంట్స్, ఆ ట్రోల్స్ కి తగ్గట్టే రిప్లై ఇస్తుంటుంది.

Anasuya wore classical saree netizen comments
Anasuya

అప్పుడప్పుడు తనపై వచ్చే ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెబుతుంది అనసూయ. ఇటీవ‌ల అన‌సూయ పొట్టి దుస్తుల‌లో ఫొటో షూట్ చేయ‌గా.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా ? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు.. అని ఓ నెటిజ‌న్‌ కామెంట్ చేశాడు. అయితే అనసూయ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ.. దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అని పోస్ట్ చేసింది.

అప్పుడ‌ప్పుడు ఈ ముద్దుగుమ్మ చాలా ప‌ద్దతిగా కూడా క‌నిపిస్తుంటుంది. శ్రీ రామ నవమి సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న అనసూయను చూసి తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎంత ప‌ద్ద‌తిగా ఉన్నారు.. అని ఒక‌రు కామెంట్ చేయ‌గా, మ‌రొక‌రు మీరు ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉన్నారో.. ఇలా ఉంటే మీకు ఎప్పటికీ నెగెటివ్ కామెంట్స్ అసలు రావు. మీలాంటి సెలబ్రిటీలను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు మీలా పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి.. అనుకుంటారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా తాను షేర్ చేసిన తాజా ఫొటో ప్ర‌తి ఒక్క‌రినీ చాలా ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి