Anasuya : దాక్షాయ‌ణిగా అన‌సూయ.. భ‌యంక‌రంగా క‌నిపిస్తున్న బ్యూటీ..!

November 10, 2021 10:54 AM

Anasuya : బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ వెండితెర‌పై అద‌ర‌గొడుతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించి సంద‌డి చేసిన అన‌సూయ ఇప్పుడు పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణిగా క‌నిపించ‌నుంది. తాజాగా ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేశారు. ఇందులో భ‌యంక‌ర‌మైన లుక్‌లో క‌నిపిస్తూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. మంగ‌ళం శీను పాత్ర పోషిస్తున్న సునీల్ భార్య‌గా అన‌సూయ క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Anasuya to appear as dakshayani in pushpa movie

అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇటీవల ‘మంగళం శీను’ అంటూ సునీల్‌ పాత్రను మనకు పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా అన‌సూయ పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేసి అంచ‌నాలు పెంచారు. ఈమె పాత్ర పీక్స్‌లో ఉంటుంద‌ని పోస్ట‌ర్ ద్వారా అర్ధ‌మ‌వుతోంది. అన‌సూయ చివరిగా ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ సినిమాల్లో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment