గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Alia Bhatt : ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఆలియా భట్ టార్చర్

Alia Bhatt : ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ  సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న…

Alia Bhatt : ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఆలియా భట్ టార్చర్

Alia Bhatt : ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ  సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే సంక్రాంతికే ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే ఆలియా భట్ యాక్ట్ చేసిన గంగూబాయ్ కతియావాడి సినిమాతోపాటు ప్రభాస్, పూజా హెగ్డె నటిస్తున్న లేటెస్ట్ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమాకు మధ్య క్లాష్ వస్తుందా.. అంటూ రాజమౌళి అభిప్రాయపడుతున్నారు.

Alia Bhatt torture to unit in rrr movie shooting

ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ తో కలిసి రాజమౌళి తన సినిమా ప్రమెషన్స్ కోసం కలిశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి టీజర్ గ్లింప్స్ కూడా విడుదల చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్‌, అజయ్ దేవగణ్ గురించి రాజమౌళి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఆలియా భట్ తన డైలాగ్స్, మూవీ లైన్స్ గురించి తెలుసుకునే క్రమంలో చాలా టార్చర్ చేసేదని అన్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తనకు మంచి స్నేహం ఉండటంతో వాళ్ళతో వర్క్ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అలాగే అజయ్ దేవగణ్ కూడా ఎంతో డెడికేషన్ ఉన్న వ్యక్తి అని అన్నారు. అజయ్ ఎప్పుడూ షాట్ రెడీ అవుతుందా అని తన కారవాన్ దగ్గరకు కూడా వెళ్ళకుండా షూటింగ్ స్పాట్ లోనే కూర్చుని తన వైపే చూస్తూ.. సార్ నా అవసరం ఏమైనా ఉందా.. అని అడిగేవారని రాజమౌళి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి