గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Akkineni Amala : అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ అక్క‌డికి వెళ్తా.. అమ‌ల కామెంట్స్ వైర‌ల్‌..

Akkineni Amala : చాలాకాలం తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు తల్లిగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది  అమల అక్కినేని.  అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అమల నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.…

Akkineni Amala : అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ అక్క‌డికి వెళ్తా.. అమ‌ల కామెంట్స్ వైర‌ల్‌..

Akkineni Amala : చాలాకాలం తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు తల్లిగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది  అమల అక్కినేని.  అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అమల నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అమల కూడా పాల్గొంటోంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. 2014 లో మనం చిత్రంలో డాన్స్ టీచర్ గా అతిథి పాత్రలో కనిపించిన అమల మరలా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.

తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అమల. శివ చిత్రంలో నాగార్జునకు భార్యగా నటించిన అమల నిజజీవితంలో కూడా నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత  చిత్రాలకు దూరమై కుటుంబ బాధ్యతలను అంకితమైపోయింది. అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్త నాగార్జున బిజినెస్ లో సహాయం చేస్తూ సమయం గడుపుతుంది.

Akkineni Amala said she will go back in time if chance gets
Akkineni Amala

ఒకే ఒక జీవితం చిత్రంలో హీరో శర్వానంద్ తల్లిగా  అమల కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకున్న సందర్భంగా అమల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా  అమల‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఉన్న విధంగా టైం మిషన్ లోకి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని.. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను కౌగిలించుకొని  ఒక్కసారిగా  ఏడ్చేసిందని అమల చెప్పుకొచ్చారు.

ఇక నాగార్జున గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నా సక్సెస్ లో ఎప్పుడు భాగమై ఉంటారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని అడగ్గా.. మేము ఇంట్లో కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్ పై కూడానా.. వ‌ద్దు.. అంటూ నవ్వుతూ జవాబు ఇచ్చింది. అమల ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్న తన అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి