Akira Nandan : మెగా ఫ్యామిలీ నుండి హీరోలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటికే క్రికెట్ జట్టు కూడా తయారైంది. ఇక పవన్ తనయుడు అకీరా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఎన్నోసార్లు అకీరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెబుతూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టింది. అకీరా బర్త్ డే సందర్భంగా మళ్లీ అకీరా వెండితెర ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి.
అకీరాకు 18 ఏళ్లు వచ్చాయ్.. అకీరా నాకు కేవలం ఒక మంచి కొడుకు మాత్రమే కాదు.. ఆద్యకు ఓ మంచి అన్న.. తన స్నేహితులకు గొప్ప ఫ్రెండ్, ఎంతో దయాగుణం ఉన్నవాడు.. నిజాయితీ పరుడు.. ఓ జెంటిల్మన్. ఈ రోజు అకీరా యవ్వనంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అకీరాకు విషెస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని బాక్సింగ్ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్. దీంతో అకీరా సినీ ఎంట్రీపై ఊహాగానాలు వచ్చేశాయ్. దీనిపై రేణూ దేశాయ్ స్పందించింది. అతడికి నటనపైన ఆసక్తి లేదు.. ఏ సినిమాలోనూ పాటలు కూడా పాడటం లేదు.. అతని ఎంట్రీ గురించి వచ్చే వార్తలను నమ్మకండి అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇక అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. అన్నింట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. చూస్తుంటే రానున్న రోజులలో వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…