గురువారం, జూన్ 11, 2026
టెక్నాల‌జీ

రూ.456 ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్‌.. 50జీబీ డేటా ఫ్రీ..!

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ కొత్త‌గా రూ.456కు ఓ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. జియో ఇటీవ‌లే ఎలాంటి రోజువారీ లిమిట్ లేకుండానే కొత్త ప్లాన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదితమే. అందుకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను…

రూ.456 ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్‌.. 50జీబీ డేటా ఫ్రీ..!

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ కొత్త‌గా రూ.456కు ఓ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. జియో ఇటీవ‌లే ఎలాంటి రోజువారీ లిమిట్ లేకుండానే కొత్త ప్లాన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదితమే. అందుకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను ప్ర‌వేశపెట్టింది. ఇందులో ల‌భించ‌నున్న స‌దుపాయాలు ఇలా ఉన్నాయి.

airtel launched rs 456 prepaid pack with no daily data limit

రూ.456 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 50 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. దీనికి రోజు వారీ లిమిట్ లేదు. ఈ ప్యాక్ వాలిడిటీని 60 రోజులుగా నిర్ణ‌యించారు. క‌నుక అప్ప‌టిలోగా డేటాను ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిష‌న్ ఉచిత ట్ర‌య‌ల్ ల‌భిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ ఉచిత సేవల‌ను పొంద‌వ‌చ్చు. ఫాస్టాగ్‌పై క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

ఈ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, యాప్‌, ఇత‌ర విధానాల్లో రీచార్జి చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. కాగా జియోలో రూ.447 ప్లాన్‌లో 50జీబీ డేటా ల‌భిస్తుంది. దీనికి 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. ఎప్పుడైనా ఎంత డేటాను అయినా వాడుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి