Adivi Sesh : ప్రస్తుత తరుణంలో అనేక సినిమా ఇండస్ట్రీలలో పెళ్లి కావల్సిన హీరోలు చాలా మందే ఉన్నారు. ఓ వైపు కొందరు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటన్నప్పటికీ ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి కూడా ఇంకా పెళ్లి కాని హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు టాలీవుడ్‌లోనూ ఉన్నారు. ఆ జాబితాలో నటుడు అడివి శేష్ ఒకరు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. నటుడిగా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కూడా చాటుకున్నారు. ఈయన నటిస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మేజర్ పేరిట అడివి శేష్ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
జూన్ 3వ తేదీన విడుదలైన అడివి శేష్ మేజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. శేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా మేజర్ నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు మొత్తం రూ.60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌లను నిర్వహిస్తూ వస్తోంది. వాటిల్లో పాల్గొంటున్న అడివి శేష్ పలు కీలక విషయాలను పంచుకుంటున్నాడు. ఇక తన పెళ్లి విషయమై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఇంతకీ అసలు శేష్ ఏమన్నారంటే..
ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది కదా.. పైగా అనేక చిత్రాలు హిట్ అయ్యాయి.. ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది.. ఇక పెళ్లి గురించి ఆలోచించరా.. అని కొందరు జర్నలిస్టులు శేష్‌ను ఇంటర్వ్యూ సమయంలో అడిగారు. అయితే అందుకు శేష్ సమాధానమిస్తూ.. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని తెలియజేశాడు. అయితే తన పుట్టిన రోజున ఆ అమ్మాయి పెళ్లి అయిందని.. దాని ఎఫెక్ట్ తనపై బాగా పడిందని.. ఈ క్రమంలోనే పెళ్లిపై దృష్టి సారించలేకపోతున్నానని చెప్పాడు. అంటే శేష్ ది లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అని ఇట్టే తెలిసిపోతుంది. ఇక శేష్ త్వరలో హిట్ 2 మూవీతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే అప్పట్లో సంచలన విజయం సాధించిన గూఢచారి మూవీకి సీక్వెల్‌లోనూ ఈయన నటిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…