Aditi Rao Hydari : తన అందం, అభినయంతో అదితి రావు హైదరి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. చెలియా, వి, మహా సముద్రం వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు చూసినా మెరిసే రంగుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం ఈమె ఏ విధమైనటువంటి బ్యూటీ టిప్స్ పాటిస్తుందనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఇందుకు ఆమె సమాధానం చెప్పేసింది.
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి మొదటిసారిగా తన బ్యూటీ సీక్రెట్ గురించి ఓపెన్ గా వెల్లడించింది. తనఅందాన్ని రెట్టింపు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ.. తాను సహజసిద్ధంగా లభించే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తానని తెలిపింది. షూటింగ్ లేని సమయంలో తాను ఏ విధమైనటువంటి మేకప్ లేకుండా ఉంటానని ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప మరే ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించనని తెలిపింది.
ఇక సెల్ఫీలకు పోజులు ఇచ్చే సమయంలో తాను ఎలాంటి ఫిల్టర్ ఉపయోగించనని తనకు నాచురల్ గా ఉండటమే ఇష్టం అని తెలిపింది. ఇక షూటింగ్ సమయంలో షూటింగ్ పూర్తి కాగానే తనకు మేకప్ రిమూవ్ చేసుకోవడం అలవాటు ఉందని, రాత్రి పడుకునే ముందు కూడా మేకప్ రిమూవ్ చేసి పడుకుంటానని తెలిపింది. అలాగే ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసిన బ్యూటీ ఆయిల్ రాయటం వల్ల తన చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుందని ఈ ముద్దుగుమ్మ తన అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ ను బయట పెట్టింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…