గురువారం, జూన్ 11, 2026
వినోదం

Adhurs Re-release Date : అదుర్స్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి చారీ, భట్టు కామెడీ..!

Adhurs Re-release Date : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాని ఇప్పటికీ చాలామంది మర్చిపోయి ఉండరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2010లో ఈ సినిమా…

Adhurs Re-release Date : అదుర్స్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి చారీ, భట్టు కామెడీ..!

Adhurs Re-release Date : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాని ఇప్పటికీ చాలామంది మర్చిపోయి ఉండరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2010లో ఈ సినిమా రిలీజ్ అయ్యి, మంచి విజయాన్ని అందుకుంది. పైగా, ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది, ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా చాలామంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. పైగా అదుర్స్ సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ కూడా కొట్టదు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేశారు.

ముఖ్యంగా చారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే, ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అదుర్స్ సినిమా థియేటర్ల లోకి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని, అంతా ఎదురు చూస్తున్నారు. అయితే, ఎట్టకేలకి అదుర్స్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 18న అదుర్స్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Adhurs Re-release Date soon to show in theatres
Adhurs Re-release Date

అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాది మార్చి 4న అదుర్స్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అది అప్పట్లో వాయిదా పడింది. దీంతో, ఫోర్ కే ఫార్మాట్లో నవంబర్ 18 వ తేదీన అదుర్స్ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రమా ప్రభ, శయాజి షిండే, నాజర్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు వహించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, వల్లభనేని వంశీ సినిమాని నిర్మించారు. కోన వెంకట్ సినిమాకి కథని అందించారు. నయనతార, షీలా హీరోయిన్లుగా కనబడి ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో బ్రహ్మానందం కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, పంచ్‍లు మూవీ కి బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ కూడా వర్క్ అవుట్ అయింది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి