Actress Sudha : తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అందరికంటే ముందుంటారు సుధ. 30 ఏళ్ళ కింద కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించింది. తెలుగు మాత్రమే కాదు.. సౌత్ భాషలన్నింటిలోనూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది సుధ. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా.. సీనియర్ నటిగా క్రేజ్ కూడా తెచ్చుకుంది సుధ. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీనే. ఈ మధ్యే ఈమె ప్రధాన పాత్రలో మాతృదేవోభవ అనే సినిమా వచ్చింది.
ఇక ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో సుధకు ఘోర అవమానం జరిగిందట. ఆమెను మాటలతో బాధించారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదిచింది కానీ ఆమెకు డాన్స్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఓ సందర్భంలో సీన్ కి తగ్గట్టు స్టేజిపై ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందట. నిజానికి సుధకి డాన్స్ అసలు రాదు. అయినా కానీ డైరెక్టర్ చెప్పడంతో సుధ డాన్స్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఎంత చెప్పినా.. సుధ తన డాన్స్ మెప్పించలేకపోయింది.
ఇక మాస్టర్ కి కోపం రావడంతో అందరూ ఉండగానే నీ ముఖానికి డ్యాన్స్ రాదు ఏం లేదు. అని అవమానించడంతోపాటు.. నువ్వు దేనికి పనికిరావు అంటూ కోపడ్డారట. అందరి ముందు అలా అరిచే సరికి సుధ అక్కడే కన్నీరు పెట్టుకున్నారట. ఇక పట్టుదలతో ఆ స్టెప్ నేర్చుకుని మరీ.. బాగా చేసిందట సుధ. అయితే సుందరం మాస్టారు అప్పుడు కోపంలో అలా అన్నారే తప్ప.. ఆయనకు సుధపై ఎటువంటి కోపం లేదు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే సుందరం మాస్టర్ వేరే సినిమాలో తల్లి రోల్ చేయడానికి సుధ అయితే బాగుంటుంది అని రికమండ్ చేసి.. ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారట. సుధ కూడా వెంటనే సినిమా ఒప్పేసుకుందట.
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…